వరద బాధితులకు విరాళం ఇచ్చినా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
ఖమ్మం వరద బాధితులకు విరాళం ఇచ్చినా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
ఎల్లారెడ్డి, ఆర్ పి న్యూస్ : నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కళాకారులు ఆదివారం విరాళాలు సేకరించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం వరద బాధితులకు తమ వంతు సహాయం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ విపత్తులు సంభవించినప్పుడు ప్రతి ఒక్కరు మానవ దృక్పథంతో ప్రతి ఒక్కరు తమ వంతు సహాయం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు సొంటెం సాయిలు, అన్యబోయిన శ్రీనివాస్, సొంటెం రాజలింగం యాదవ్ ,దేవరాజ్ వడ్ల వెంకన్న ,కత్తూరి కిషన్ ,శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..