తుడుం దెబ్బ వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక

0

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ వరంగల్ జిల్లా కమిటీ

 

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ వరంగల్ జిల్లా కమిటీ నర్సంపేట పట్టణంలోని రాజుపేట ఎస్ఎంహెచ్ హాస్టల్ దగ్గర వట్టం ఉపేంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య , వట్టం ఉపేందర్ (రాష్ట్ర అధ్యక్షులు ), వట్టం కన్నయ్య (రాష్ట్ర కార్యదర్శి) మాట్లాడుతూ

దేశ వ్యాప్తంగా రాజులకు, బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా 200 సంవత్సరాలు ఆదివాసులు పోరాటం చేసి ,ఆదివాసి వీరులు కొమరం భీం, ,బిరసా ముండా ,రాంజీ గోండు ,మల్లుదొర ,గంటం దొర లాంటి ఎందరో ఆదివాసి వీరులు అమరులైన తర్వాతనే 1874లో ఆదివాసులకు ప్రత్యేక భూభాగాన్ని కేటాయించడం జరిగింది. అయినా గిరిజనేతర కులాలు ఏజెన్సీ లోకి విపరీతంగా వలసలు రావడంతో సంస్కృతి ,సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ కూడా నిర్వీర్యం అవుతుంటే ,ఆదివాసీలు మరోసారి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాతనే 1917 చట్టం తీసుకువచ్చారు. అప్పుడు ఆదివాసులకు భూమిపైన పూర్తి హక్కు వచ్చింది.ఆదివాసీల రక్షణ కోసం , భూముల కోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26 తేదీన రాజ్యాంగం ఏర్పాటు చేసేటప్పుడు ఆదివాసీల అమాయకత్వాన్ని ,వెనుకపాటితనాన్ని ,నిరక్షరాస్యతను దృష్టిలో పెట్టుకొని ఆదివాసీల అభివృద్ధికి, సాంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడడం ,గిరిజనేతల వలస దోపిడీదారులను అడ్డుకోవడం కోసం ,వలసలను అరికట్టడం కోసం, రాజ్యాంగంలో అనేక రకాల హక్కులు ,ప్రత్యేకమైన ఐదు, ఆరో షెడ్యూల్ తీసుకురావడం జరిగింది ,ఈ షెడ్యూల్ను రాజ్యాంగం లో మినీ రాజ్యాంగ పిలవబడుతున్నది ,ఈ మినీ రాజ్యాంగంలో వలసలను అరికట్టడానికి 1/59 చట్టం ,1/70 చట్టాలను భూమి రక్షణ చట్టాలను తీసుకొచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల నుండి గిరిజనేతరులు భూములను కొనుగోలు చేయకూడదని నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. అయినా కూడా చట్టాలను ఉల్లంఘిస్తూ విరిజనేతరులు వలసలు 60 శాతానికి పెరిగి, ఏజెన్సీలో గిరిజనేతల పెత్తనం పెరిగి, రాజకీయ పార్టీలు అండ దండలతో ప్రతి గ్రామంలో పార్టీ కార్యకర్తలుగా చలామనవుతు, ఆదివాసీల అమాయకత్వాన్ని ,నిరక్షరాశ్యతను గుర్తించి ఆదివాసులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ, వడ్డీ మునాబాల పేరుతో, భూములను కౌలుకు తీసుకొని వడ్డీ కిందనే సంవత్సరాలుగా దున్నుకోవడం, అసలు మొత్తం కట్టని యెడల అధికార పార్టీల అండదండలతో ఆదివాసీల భూములను అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు

 

ఈ విధంగా ఆదివాసి భూములు సగానికి ఎక్కువ భూములు గిరిజనేతరుల కబ్జాలోని ఉన్నవి. గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించుకొని తన భూములలోనే ఆదివాసీలను కూలీలుగా పని చేయించుకున్టు దర్జాగా బ్రతుకుతున్నారు. ఏజెన్సీలో గిరిజనేతర్లు రాజకీయంగా బలపడి ఆదివాసీలకున్న హక్కులను, చట్టాలను తమ పలుకుబడితో నిర్వీర్యం చేస్తున్నారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా అటవీ హక్కుల పట్టాలు ఉన్న పోడు భూముల్లో కందకాలు కొడుతున్నారు, అడ్డు తిరిగిన ఆదివాసులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలలో గెలిచిన నేతలను కమిటీ సభ్యులుగా ఎన్నిక చేయడం, రాజ్యాంగ చట్టాలైన” పేసా చట్టాన్ని నిర్వీర్యం చేయడమే అవుతుంది .అందుకనే ఇందిరమ్మ కమిటీలను కమిటీలలో ఉన్న గిరిజనేతర సభ్యులను వెంటనే తొలగించాలని ,ఆదివాసి లపై పెట్టిన కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1/8/ 2024 ఎస్సీ ఎస్టీ తెగలలో రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని ఆయా రాష్ట్రాలకు ఏడుగురు జడ్జీల ధర్మాస్కం తీర్పునిచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ప్రజలు ,మేధావులు ,సామాజిక ఉద్యమకారులు ,ఆదివాసి సంఘాలు ,ఆదివాసి విద్యార్థులు ,నిరుద్యోగులు ,గిరిజన తెగల వర్గీకరణను సమర్థించి, అభినందనలు తెలిపారు. తెలంగాణలోని 9 ఆదిమ తెగల విద్యార్థులకు ,నిరుద్యోగులకు రాజకీయంగా ఎదిగే వాళ్లకు, ఉపాధి రంగాల్లో ఆదివాసి ప్రజలకు న్యాయం జరుగుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. లంబాడాల సమస్య ఇంకా సుదీర్ఘకాలం కొనసాగితే విద్యా ,ఉద్యోగ ,రాజకీయ ఉపాధి రంగాలతో పాటు, భూమి, అటవీ ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున ఆదివాసి తెగలు నష్టపోతారు,

రిజర్వేషన్లు ఉమ్మడిగా ఉండటం వలన ఏజెన్సీ ప్రాంతాల పరిధిలోని 29 శాఖల్లో ఉద్యోగాలు లంబాడీలు అధికంగా పొందారు . లంబాడాలను తొలగించే డిమాండ్ సుదీర్ఘకాలం కొనసాగడం వలన ఆదివాసి విద్యార్థులకు, నిరుద్యోగులకు ,సమస్త ఆదివాసి ప్రజలకు నష్టం కలుగుతుంది .వెంటనే షెడ్యూల్ తెగల వర్గీకరణ కోసం కమిషన్ వేయాలని డిమాండ్తో విద్యార్థులు ,నిరుద్యోగులు, మహిళలు సమస్త ప్రజలు ,పోరాడవలసిన అవసరం ఉన్నది, హక్కులు చట్టాలు అమలు కావాలన్నా ,ఎస్టీ వర్గీకరణ కోసం కమిషన్ వేయాలన్న ,ఆదివాసి ప్రజలు ప్రజా సామికవాదులు ,విద్యార్థులు ,ఉద్యోగులు, మహిళలు ఆదివాసి ప్రజలందరూ ఏకం కావాలని ,అందుకోసం రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మహాసభలు ,నిర్వహించుకోవడం, జిల్లా మహాసభలు నిర్వ హించుకోవటం డిసెంబర్ 5నుండి డిసెంబర్ 10 వరకు జిల్లా కమిటీలు పూర్తి చేసి, 2024 డిసెంబర్ 22 23 తేదీలలో ములుగు జిల్లా ,ఎటునాగారం కేంద్రంలో గిరిజన భవన్ నందు తుడుందెబ్బ 9వ రాష్ట్ర మహాసభలను జరుగుతున్నవి . రాష్ట్రం లోని అన్ని జిల్లాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామని వారు తెలిపారు.

అనంతరం వరంగల్ జిల్లా అడక్ కమిటీని ఎన్నికున్నారు.

కన్వీనర్ గా గొంది నాగేశ్వరరావు, కో కన్వీనర్లుగా గట్టి సారంగపాణి, ఈసం నరసయ్య, స్వర్ణపాక సందీప్, పుల్సం నాగయ్య, ఆగబోయిన నితీష్, వజ్జ రమణయ్య, ఈక వెంకటేశ్వర్లు,గొంది నరసయ్య లను ఎన్నుకున్నారు.

ఖానాపూర్ మండల కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది

అధ్యక్షులు: ఈసం లక్ష్మీనారాయణ

ప్రధాన కార్యదర్శి: చెర్ప శ్రీకాంత్

పదిమంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు

 

నల్లబెల్లి మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది

అధ్యక్షులు: ఆగబోయిన సదానందం

ప్రధాన కార్యదర్శి: కొట్టెం రాజు

వీరితోపాటు 9 మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు.

 

నర్సంపేట పట్టణ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది

అధ్యక్షులు: గట్టి శ్రీను

ప్రధాన కార్యదర్శి: సూర్ణపాకసునిల్ కుమార్

ఎవరితోపాటు 14మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *