భారత విప్లవం జయించి తీరుతుంది
భారత విప్లవం జయించి తీరుతుంది
గోలి కృష్ణ ~ 9441796451
భారత దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. బ్రిటీష్ వలసవాద కాలంలో దేశంలోని వివిధ
ప్రాంతాల్లో కార్మిక, విద్యార్థి, రైతాంగంఉద్యమాలు ఆయా రంగాల్లో నిర్మించిన్నప్పకీ, అవి దీర్ఘకాల విప్లవ ప్రజా
పోరాటాలుగా అభివృద్ది పర్చలేక పోయారు,కారణం స్పష్టమే ! ఆనాటి కేంద్ర పార్టీ నాయకత్వానికి ఈ దేశ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నిర్దిష్ట పరిస్థితులకు అన్వహించే సరైన మార్క్సిస్టు – లెనినిస్ట్ విప్లవ పంథా
లేదన్నది ఒక వాస్తవం.
1940 తెలంగాణా సంస్థానంలో నిరంకుశ నిజాం నవాబ్ ప్యూడల్ దేశముక్, భూస్వామ్య దోపిడీవర్గ పరిపాలన కాలంలో, స్థానిక విప్లవకారుల నిర్మాణయుత విప్లవకృషి పలితంగా, విప్లవ ప్రజాఉద్యమం 1946 నాటికీ ఉన్నత
స్థాయి పోరాటమైన సాయుధపోరాటరూపం తీసుకొన్నది.
” దున్నేవానికి భూమి – భూస్వామ్య విధానంరద్దు ” కేంద్ర నినాదం ద్వారావ్యవసాయ విప్లవం అమలు జరిగింది.
తెలంగాణా సంస్థానంలో 10 లక్షల ఎకరాల భూస్వాముల భూములుపంచుకొని, మూడువేల గ్రామాల్లో,గ్రామస్వపరిపాలన, గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని వేల సం: రాల ప్యూడల్ దోపిడీ నుండి విముక్తి
లభించి, సంస్థాన ప్రజలు తొలిసారి స్వేచ్చాయుత జీవితం ఆ రెండు సం:రాల పోరాట కాలంలో అనుభవించినారు. ఇది చారిత్రిక వాస్తవం.
1946 నుండి 51 దాకా కొనసాగినతెలంగాణా సాయుధ పోరాటం ,ఫ్యూడల్ భూస్వామ్య దోపిడీ, వ్యవసాయ, సామాజిక వ్యవస్థగల మనదేశ విప్లవానికి సంభందించిన ప్రయోగం జరిగింది. భారత సామాజిక విప్లవానికి విలువైన గుణపాఠాలు, భవిషత్తు ” విప్లవానికి ” నాంది ప్రస్తావన చేసిన పోరాటం. దేశ వ్యాపితంగా ఉన్న ప్యూడల్ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని విస్తరింప చేయాలని, తద్వారా దేశంలో ” జనతా ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేయాలనే లక్ష్యాలను ప్రకటిస్తూ, ఆనాటి రాష్ట్ర కమిటీలోనివిప్లవ నాయకత్వం ” ఆంధ్రతీసీస్ ” వ్యవసాయక విప్లవ ఎత్తుగడలపంథా, ఆనే డాక్యుమెంట్ ను రూపొందించి ఆమోదం కోసం కేంద్ర కమిటీకి అందజేసింది.
తెలంగాణా విప్లవ ప్రజాఉద్యమానికి,
సాయుధ పోరాటానికి ఏనాడు ఇసుమంతైన సహకరించని ఆనాటి కేంద్ర
కమిటీ నాయకత్వం ” తెలంగాణా
సాయుధ పోరాటం పాక్షిక సమస్యల
సాధన కోసం జరిగిందని, దానికి
జనతా ప్రజాతంత్ర విప్లవ లక్ష్యాలు లేవని, ఆంధ్రతీసీస్ ఆర్థిక పోరాటాలను మాత్రమే ప్రతిపాదిస్తున్న కారణంతో తిరస్కరించింది. కాగా, నెహ్రూ అభ్యుదయం, సోషలిజం
పట్ల భ్రమలు పెంచుకొని చరిత్రాత్మకమైన సాయుధ పోరాట విరమణను ప్రకటించింది.1951 అక్టోబర్ లో విరమించ బడినఆ పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్య
మంలో తీవ్ర సిద్ధాంత పోరాటానికి పునాదుల పడింది. ఉభయ కమ్యూనిస్టులు భారత సామాజిక విప్లవానికి
తిలోదకాలిచ్చి, పార్లమెంటరీ రాజకీయల్లో పీకలదాకా కూరుకు పోయినవిషయం తెలిసిందే. కాగా, శాస్త్రీయ మార్క్సిజం – లెనిజానికి వక్రబాస్యం చెప్పుతూ దోపిడీవర్గ బడాబూర్జువా పాలక, ప్రాంతీయ పార్టీలకు రాజకీయ
మద్దతు దారులుగా కొనసాగుతున్నపరిస్థితిని చూస్తువున్నాం. ” కమ్యూ
నిస్టులు బూర్జువాలకు సమాధాన
వాదులు. రాజీ వాదులు ఎంతమాత్రం
కారు ” అనే అంశం గమనించాలి.
అదే సమయంలో అర్థవలస, అర్ధ ప్యూడల్ దోపిడీ పునాదుల మీద నిర్మించబడిన రాజ్యాంగాన్ని, దాని
యొక్క గొప్పతనాన్ని అనునిత్యం కీర్తిస్తూ దోపిడీ పాలకవర్గాల పాలన
పరిరక్షకులుగా వున్నారు. ప్రజాస్వా
మం ముసుగులో కొనసాగించ బడు
తున్న బూటకపు పార్లమెంటరీ ఎన్ని
కల రాజకీయాల్లో ఏడుదశాబ్దాలుగా పాల్గొంటూ ప్రజలకు సంస్కరణ రాజ
కీయాలపట్ల భ్రమలు కలిపిస్తున్నారు.
కమ్యూనిస్టులు ఎన్నికల్లో పాల్గొనడం
అనేది బూర్జువా దోపిడీవర్గ రాజకీయా
ల మీద, సంక్షేమం పేరుతో పాలకులు
ప్రవేశపెట్టే ఓట్లు కొనుగోలు పథకాల
మీద ప్రలకున్న భ్రమలు తొలగించ
డానికి మాత్రమే. త్రుణమో, ప్రణమో
దక్కుతూ వుందన్న బ్రమలున్నంత
వరకు ప్రజలు విప్లవబాట పట్టరు.
సంక్షేమం ద్వారా సామాజిక మార్పు
రాదు, విప్లవం ద్వారానే ప్రజల మౌలిక
సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సామాజిక మార్పు సంభవిస్తుందని,
ప్రపంచ సోషలిస్టు దేశాలనుభవం చెప్పుతుంది.
ఉభయ కమ్యూనిస్టుల మధ్య ఐక్యత
ప్రధాన అంశం. విభేదాలు ఆ ప్రధానం.
ప్రభుత్వం అనుమతించిన మేరకు
లాంచనప్రాయ ఉద్యమాలు చేస్తూ,
ప్రజల్లో, ప్రజలతోనే ఉన్నామనే భ్రమ
లు కలిపిస్తారు. సీపీఎం పార్టీ ” నిర్ధిష్ట పరిస్థితులకు, నిర్ధిష్ట విశ్లేషణ ” లెనిన్ సూక్తి మాటున దేశంలో మార్క్సిజానికి – లేనినిజాని దేశంలో మేమే నిజమైన వారసులు చెప్పుకుంటారు. లౌకిక
వాద ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో వర్గ పోరాటాలకు తిలోదకాలిచ్చి, అస్తిత్వ, కులవాద ఉద్యమాలను ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశంలో సీపీఎం పార్టీ అనుసరిస్తున్నది కచ్ఛి
తంగా మార్క్సిజం – లెనినిజం పేరుతో, ” బూర్జువా ఉదారవాద
సిద్ధాంతమే ”
1967 – 68 లలో పశ్చిమ బెంగాల్,
నక్సల్ బరి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో గిరిజన రైతాంగం
పోరాటాలు ఉన్నత స్థాయి పోరాట
రూపమైన సాయుధ పోరాట స్థాయికి
చేరుకొన్నాయి. పాక్షిక పోరాటాలను,
పాక్షింగానే చూడాలని, వాటిని రాజ
కీయ ( అధికారం హస్తగతం చేసుకొనే) పోరాటాలుగా మార్చ కూడదనే నయా
రివిజనిస్టు రాజకీయ అవగాహన సీపీఎం పార్టీ కలిగిఉన్నది. ఈ అవగా
హనలో భాగంగా, వాటిని సాయుధ
పోరాటాలుగా అభివృద్ది చేయకూడ
దని నిర్ణయించింది.1959 నుండి సీపీఎం పార్టీలో ఆనాటి విప్లవకారుల,
పది సం: రాల విప్లవకృషి అనంతరం
గిరిజన ప్రజావుద్యమాలు,భూపంపకం
సాయుధ పోరాట స్థాయికి చేరుకున్నా
యి. ప్రజలు పాల్గొన్న సాయుధపోరా
టాలను, విప్లవం పేరుతో ఉగ్రవాదులు
చేపడుతున్న దుందుడుకు చర్యలం
టూ తప్పుడు ప్రచారంచేశారు.
మదురై రాజకీయ తీర్మానం పేరుతో,
సీపీఎం పార్టీ కేరళ, బెంగాల్5 మార్గమే మన మార్గమంటూ నగ్నమైన పార్ల
మెంటరీ రాజకీయ పంథాను ప్రతిపా
దించింది. ఆ పార్టీ అనుసరించబోయే
నయా రివిజనిస్టు రాజకీయ పంథాకు పరాకాష్ట, మదురై రాజకీయ తీర్మానం.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యా
ప్తం గాఉన్న కమ్యూనిస్టు విప్లవ
కారులు సీపీఎం నుండి విడివడినారు.
ముందుగా పశ్చిమ బెంగాల్ సిలిగురి డివిజన్ కార్యదర్శి చారుమజుందార్,
కానుసన్యాల్ నాయకత్వంలో మరి
కొందరిని కలిపి సీపీఎం పార్టీ నుండి
బహిష్కరించి బడినారు.
కాగా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి కేంద్ర
కమిటీ స్థాయిలో కామ్రేడ్, డి.వి. రాష్ట్ర
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న
కా,తరిమెల, నాగిరెడ్డి నాయకత్వంలో కామ్రేడ్స్ చండ్ర,పుల్లారెడ్డి, కొల్లా, వెంక
య్య తదితరులు, సీపీఎం పార్టీ నుండి
చీలినారు. ఆ పార్టీ అనుసరిస్తున్న
నయా రివిజనిస్టు రాజకీయాలపై పార్టీ
లో పెద్దఎత్తున ఆంతరంగిక సిద్ధాంత
పోరాటం నిర్వహించినారు. పార్టీ ప్లీనం
లో 24 జిల్లా కమిటీలకు గాను, 22
కమిటీలు ( కృష్ణా, ఖమ్మం తప్ప ) విప్లవకారుల వైపుకు వచ్చినాయి. పార్టీలో, ప్రజాఉద్యమంలో అత్యధిక భాగం కమ్యూనిస్టు విప్లవకారుల వెనుక సమీకృత మైయింది.
దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు విప్లవకా
రులు స్థూలంగా ” మార్క్సిజం –
లేనినిజం, మావో ఆలోచనా విధానం
నేటి యుగపు మార్క్సిజంగా అంగీక
రించిన వారే. కామ్రేడ్ టీ.యన్. కన్వీనర్ గా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు కమిటీ ( విప్లవ కారులు ) పేరుతో
నూతన కమిటీని ఏర్పాటు చేసినారు. సీపీఎం పార్టీ గత సంస్కరణవాద రాజకీయ ఆచరణ నుండి వేరుపడి, విప్లవ కార్యచరణను కొనసాగించేందు
కు కా, డి.వి. ” పోరాట ఉద్యమానికి పునాదులు వేయండి ” అనే పార్టీ సర్క్యులర్ ద్వారా ఉమ్మడి ఆంధ్ర
ప్రదేశ్ లో విప్లవ రాజకీయ కార్యక
లాపాలను మొదలు పెట్టినారు.
దేశ వ్యాపితంగా వివిధ రాష్ట్రాల్లోని
విప్లవకారులు సీపీఎం పార్టీలో ఏ
విధమైన సిద్ధాంత పోరాటం నిర్వ –
హించకుండానే వ్యక్తులుగా బైటికి
వచ్చినారు. పశ్చిమ బెంగాల్ నుండి
ముందుగా బయటకు వచ్చిన చారు
మజుందార్ దేశంలో ఇతర రాష్ట్రాల విప్లవకారులతో సంబందం లేకుండా ఏకపక్షంగా, అఖిల భారత కమ్యూ –
నిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీ 1967 లో, ఏర్పాటు చేసినారు.
ఈ కమిటీకి ఆంధ్ర కమ్యూనిస్టు విప్లవ
కారులు చేరకుండా దూరంగా ఉన్నా
రు. మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా సిద్ధాంతం అందరూ అంగీక
రించి నప్పటికీ, భారత విప్లవానికి
సంభందించి వ్యూహం, ఎత్తుగడలు, సాయుధ పోరాటం కొనసాగించడం అనే అంశంలో సమగ్రంగా చర్చించిన తరువాతనే కలిసిపని చేయాలనే అభిప్రాయంతో ఉన్నారు.
చారుమజుందార్ ఏర్పాటు చేసిన
అఖిల భారత సమన్యవయ కమిటీలో
ఆంధ్ర కమిటీలో కొందరి వత్తిడి మేరకు
కామ్రేడ్స్ డి.వి. టి.యన్ లు చేరినారు.
ఒక సమావేశంలో చేరి, మరో సమా
వేశం నాటికీ, సమన్వయకమిటీ నుండి
ఆంధ్ర కమిటీని చారుమజుందార్
భహిస్కరించినారు. కారణం స్పష్టమే !
సాయుధ పోరాట అనుభజ్ఞులైన
కామ్రేడ్ డి.వి. మార్క్సిస్టు – లెనినిస్ట్ మెదో సంపన్నుడైన కామ్రేడ్ టి.యన్.
లు కమిటీలో వుంటే తన అధారిటేరి
యన్ రాజకీయాలు చెల్లుబాటుకావని
ఆంధ్ర కమిటీని బహిస్కరించినారు.
కామ్రేడ్స్ డి.వి. టి.యన్, సి.పీ. రెడ్డి, తదితరులతో 1969లో రాష్ట్ర సదస్సు నిర్వహించినారు. దేశంలో జనతాప్రజా
తంత్ర విప్లవదశ కొనసాగుతున్నదని,
ఈ విప్లవ దశకు సంబంధించి, వ్యవ
సాయక విప్లవోద్యమ నిర్మాణం, తక్షణం సాయుధ పోరాటానికి దారి తీయగల ” తక్షణ కార్యక్రమం ” పేరు
తో విప్లవ ప్రజాపంథా ఆమోదించి
నారు.
ఈ పంథా భారత దేశం అర్థవలస, అర్ద
ప్యూడల్ సమాజంగా కొనసాగుతుంద
ని, దళారి బడాబూర్జువా, భూస్వామ్య
వర్గాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ముసుగులో దోపిడీ వర్గ పాలన కొన
సాగుతుందనే సూత్రీ కరించినారు.
గ్రామీణ ప్రాంతంలో ” దున్నేవానికి భూమి – భూస్వామ్య విధానం రద్దు ”
కేంద్ర నినాదాన్ని పునాదిగా చేసుకొని వ్యవసాయక విప్లవోద్యమం నిర్మించా
లి. ప్రజల ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా భూస్వాములు భూముల ఆక్రమణకు
ప్రజలను కదిలించి, పంచుకున్న
భూములను రక్షిణకోసం ప్రజలు అను
భవ పూర్వకంగా సాయుధ పోరాట
అవసరాన్ని ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు
పాల్గొనే నిజమైన సాయుధ పోరాటం
గా, కార్మిక వర్గ పార్టీ నాయకత్వంలో
జనతా ప్రజాతంత్ర విప్లవంగా అభి
వృద్ది చెందుతుంది.
1968 మే లో చారుమజుందార్ కొంత
మందితో సీపీఐ ( యం. ఎల్) అఖిల
భారత పార్టీని ప్రకటించుకొన్నారు.
” భారత విప్లవం 1975 నాటికీ విజయ
వంతమౌతుందని, విప్లవ ప్రజాసంఘా
ల నిర్మాణం అవసరం లేదని, వర్గశత్రు
నిర్మూలన, సాయుధ పోరాటమే ఏకైక
మార్గమని, ” అతివాద దుస్సాహసిక
పంథాను ప్రకటించారు ”
వర్గ శత్రువు నిర్మూలన జరుపడానికి
మార్క్సిజం – లేనినిజం, మావో ఆలో
చన సిద్ధాంత పునాది ఎంతమాత్రం
అవసరం లేదు. కాగా, వ్యవసాయక
విప్లవోద్యమంలో ప్రజలను సమీకరించి
ఉన్నత ఉన్నతస్థాయి పోరాట రూప
మైన సాయుధ పోరాటం కొనసాగించ
దానికి మార్క్సిజం – లేనినిజం మావో
ఆలోచనా సిద్ధాంత పునాది అవసరం.
చారుమజుందార్ అతివాద దుస్సాహ
సిక సిద్ధాంతం అనుసరించడం వలన
విప్లవ ప్రజల సాయుధ పోరాటాలుగా
అభివృద్ది చెందిన నక్సల్ బరి, శ్రీకాకుళ
గిరిజన రైతాంగ ఉద్యమాలు ప్రభుత్వ
ఫాసిష్టు దమనఖాండకు కకావికలమై
నాయి. ప్రభుత్వం ఫాసిస్టు దామన నీతితో ఎదురు కాల్పుల పేరిట ఎందరో
త్యాగధనులైన కమ్యునిస్టు విప్లవకారు
ల నాయకులు, కార్యకర్తలు అమరు
లైనారు. చారుమజుందార్ మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా విధానం పేరుతో రూపొందించి అమలు జరిపిన ” అతివాద దుస్సాహసిక వాద సిద్ధాం
తానికి ” భారత కమ్యూనిస్టు విప్లవోద్య
మం చెల్లించిన భారీ మూల్యం.
” విప్లవంలో ఒక వర్గ మరో వర్గాన్ని బలప్రయోగం ద్వారా కులద్రోయాలనే
కార్యక్రమం వుంటుంది. వర్గ సమాజా
న్ని మార్చడానికి బలప్రయోగం” మంత్ర
సాని ” పాత్ర పోషిస్తుందని శాస్త్రీయ
మార్క్సిజం ప్రబొదిస్తున్నది. బలప్రయో
గం ద్వారానే రష్యా, చైనా విప్లవాలు
జయప్రదంగా ముగిశాయి. శ్రామికక
వర్గ విప్లవంలో ప్రజలు పాల్గొని బల
ప్రయోగం ద్వారా దోపిడీ వర్గపాలనను కూల్చేటప్పుడు హింస అనివార్యం.
అది విప్లకర హింస. వ్యక్తిగత హింస
కాదు.” విప్లవంలో హింస వుంటుంది. హింసే విప్లవం కాదు.”
కామ్రేడ్స్ డి.వి. టి.యన్. ల నాయ
కత్వంలో తెలంగాణా సాయుధ పోరా
ట అనుభవాల ద్వారా విప్లవ ప్రజా
పంథావరూపొందించ బడింది కామ్రేడ్స్
డి.వి. టి.యన్. లను సరికొత్త రివిజ
నిస్టులని, ” వ్యవసాయక విప్లవ ప్రజా
పంథాను ఆర్థికవాదమని, వారు సాయుధపోరాట వ్యతిరేకులనే పెద్ద
ఎత్తున నిందాప్రచారం, చారుమజుం –
దార్ యం.యల్. గ్రూపు విప్లవ
శ్రేణుల్లో, ప్రజల్లో చేసింది. సాయుధ
పోరాటం మనే concept ఆ రోజుల్లో
యువకులకు విపరీతమైన క్రేజ్ ఏర్ప
డింది. ఆ క్రేజ్ తో అతివాద దుస్సాహ
సికవాద, తప్పుడు సిద్ధాంతానికి ఆక
ర్షితులైన యువకులు ఎందరో ఆత్మ
పరిత్యాగంచేసి బలైపోయినారు.
ఈ పరిణామాలు భారత సామాజిక
విప్లవాన్ని కొన్ని దశాబ్దాలపాటు
వెనక్కునెట్టింది. సంస్కరణవాద నయా రివిజనిస్టు రాజకీయాలకు తిరిగి జీవం పోసింది.
ఈ దేశ విప్లవానికి ” ఇరుసులాంటి
వ్యవసాయక విప్లవాన్ని ” మాటల్లో
అంగీకరించడం, ఆచరణలో ఖతం
కార్యక్రమాన్ని అమలు జరపడం, ఫలి
తంగా విప్లవోద్యమం పక్కదారి పట్టి,
దేశంలో బలమైన విప్లవ ప్రజాతంత్ర ఉద్యమం అభివృద్ది కాలేదు.
మరోవైపు కమ్యూనిస్టు విప్లవకారుల్లో
చీలికలు ఏర్పడినాయి. కా, సి.పీ.రెడ్డి
విప్లవోద్యమంలో వ్యక్తిగత బలహీనత
లు ప్రదర్శించి సరైనవిప్లవ పునాదుల
నిర్మించబడుతున్న విప్లవ ప్రజాఉద్య
మంలో చీలికలు సృష్టించినాడు.
కామ్రేడ్స్ డి. వి. టి. యన్.లతో పాటు
మెజారిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు
ప్రభుత్వ కుట్రకేసులో నిర్భందించి, జైల్లో ఉన్న సమయాన్ని ఉపయోగించు
కొని పార్టీని చీలికలు గురిచేశాడు.
ఈ మహానాయడికుడి ఆధ్వర్యంలో
మరో సీపీఐ ( యం. ఎల్) పార్టీ ఏర్పా
టైంది. వ్యవసాయ విప్లవోద్యమ నిర్మా
ణం, భూస్వాముల భూమి పంకకంతో
సంబందం లేకుండా, దళాలను ఏర్పా
టుచేసి ” కేడర్ ఆత్మరక్షణ పోరాట
రూపంగా సాయుధ పోరాటం ” అన్న
సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టి, కుత్రిమ
సాయుధ పోరాటాన్ని సృష్టించినాడు.
ఆత్మరక్షణ అనేది రాజ్యాంగ చట్టబద్ధ
చర్యే అవుతుంది.
వీరి సాయుధ దళాల తుపాకి గుండ్లు
తమ రాజకీయ ప్రత్యర్ధులమీద, వారికి
లేవీలు ఇవ్వవని కాంట్రాక్టర్ల మీద పేలి
నాయి. ప్రభుత్వ నిర్భంద యంత్రాంగం
లోనీ పోలీసులు మీద ఎక్కకడ పేలిన
దాఖలాలు లేవు. ఈ కుత్రిమ సాయుధ పోరాటం పై కమ్యూనిస్టు విప్లవకారుల
నుండీ వచ్చిన విమర్శలతో ” ప్రతిఘ
టణ ” పోరాటంగా ప్రచారం చేసినారు. ఈ పార్టీ గోదావరిలోయ ఉద్యమంతా సాయుధ దళాల సంచారంతో వునికి లోకి వచ్చిన ఉద్యమమే.
విప్లవ ప్రజాపోరాటల ద్వారా అభివృ
ద్దిచెంది ఉనికిలోకి వచ్చిన ఉద్యమం
ఎంతమాత్రం కాదు. సి.పీ. రెడ్డి అతి
వాద వాగాడంభరం ముసుగులో, మితవాద అవకాశవాద, పేటి బూర్జు
వా విప్లవ సిద్దాంతాన్ని అమలు జరిపి
నారు. ఫలితంగా ఆగ్రూపు చీలికలలో
ప్రధానంగా విప్లవ రాజకీయ అంశాల
ప్రాతిపదిక ఎంత మాత్రం లేదు. ఆర్థిక,
అనైతిక, హత్య ముఠా రాజకీయాలు
ఒక వైపు, మరో వైపు మితవాద,
సంస్కరణవాద రాజకీయాలతో అనేక చీలిలకు గురిఅవుతూ వున్నది.
1970 కామ్రేడ్స్ డి.వి. టి.యన్. లు
జైల్ నుండి విడుదలైన తరువాత,
మార్క్సిజం – లేనినిజం, మావో ఆలో
చన విధాన పేరుతో వున్న అనేక,
పెడదొరణులు, తప్పుడు వాదనలకు వ్యతిరేకంగా, పెద్ద ఎత్తున సైద్ధాంతిక
పోరాటం నిర్వహించినారు. ఫలితంగా
ఈ సిద్దాంతాన్ని భారతదేశ నిర్ధిష్ట పరి
స్థితులకు అన్వహింస్తూ, మార్క్సిజం – లెనినిజం, మావో ఆలోచనా విధానాని
కి భారతీయ వ్యాఖ్యానంతో మరింత
గా అభివృద్ది చేసినారు. కామ్రేడ్ టి.యన్. ఈ పంథాను దేశవ్యాపితంగా విప్లవ కారుల్లో చర్చకుపెట్టీ 1975 లో
భారత కమ్యునిస్టు విప్లవ కారుల సమై
క్యతా కేంద్రం ( మార్క్సిస్టు – లెనినిస్ట్ )
యు.సి.సి ఆర్.ఐ.( యం. ఎల్ ) పార్టీని
స్థాపించినారు.
ఈ పంథా అమల్లోకి వచ్చి దశాబ్దాల గడిచినప్పటికీ, పంథా తగినంతగా ఉద్యమం అభివృద్ది కాలేదు అన్నది ఒక వాస్తవం. కమ్యూనిస్టులకు సరైన
విప్లవ పంథా మాత్రమే వుంటే సరి
పోదు. దాన్ని అమలుపర్చే ” విప్లవ
దృక్పదం ” త్యాగనిరతి గల వృత్తి
విప్లవ కారుల కేడర్ వుండాలి. ఈ
కేడర్ ఆకాశం నుండి ఉద్భవించ
బడదు. నిరంతర విప్లవవోద్యమ నిర్మాణం ద్వారా మాత్రమే ఉద్భవించి
అభివృద్ది చెందుతుంది.
ఈ పంథాలోని ప్రధాన అంశం,” భారత దేశంలో( ప్రస్తుతం ) అర్థవలస, అర్ధ
ప్యూడల్ దోపిడీ వర్గాలకు, అశేష
జనసామ్యానికి మధ్యనే ప్రధాన వైరు
ధ్యం కొనసాగుతూ ఉన్నది. ఈ వైరు
ధ్యం ఎలా పరిష్కరించ బడుతుంది ?,
జనతా ప్రజాతంత్ర విప్లవ లక్ష్యాల్ని
ఏ విధంగా పరిపూర్తి చేయాలనే అంశాలను పై పేరాగ్రాఫ్ లో పేర్కొన
డం జరిగింది.
అదే సమయంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాపితంగా పంథా అమలు జరిగిన
మేరకు ఉద్యమం కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో ఉద్యమం నిలదొక్కు
కుంది. ఇది పాలక వర్గ ప్రచారానికి
ఉద్దేశించబడిన ” సెన్సేషనల్ ” ఉద్య
మం కాదు. కామ్రేడ్ డి.వి. మాటల్లోనే చెప్పాలంటే ” కొన్నిసార్లు కోడి, డేగ
కంటే ముందుగా పైకి ఎగర గలదు.
అయినా కోడి ఆకాశంలో నిలబడలేదు.
డేగ లేచింది అంటే ఆకాశమే హద్దుగా
సాగి పోతుంది ” విప్లవ ప్రజా పంథా
ఆమలంటూ జరిగితే విప్లవ ప్రజా
ఉద్యమ పరిస్థితి పై విధంగానే వుంటుంది.
విప్లవ కారుల అగ్రశ్రేణి నాయకులు,
కామ్రేడ్, టి.యన్.1976 జులై 28 న,
అమరులైనారు. తరువాత విప్లవప్రజా
పంథా అమల్లో యు,సి,సి, ఆర్, ఐ
( యం. యల్ ) కేంద్ర, రాష్ట్ర కమిటీ
నాయకుల్లో పంథాకు తగిన ” విప్లవ
ఒరియన్ టేషన్ ” అభివ్రుద్ది చేసుకొక
పోవడం, విప్లవ ప్రజాపంథాలో ఉద్య
మం విస్తరించక పోవడం వంటి, సైద్ధాంతిక అంశాలతో పార్టీ మరోసారి
చీలికలకు గురైంది. ఈ క్రమంలోనే
భారత విప్లవ పంథా నిర్మాత, నాలుగు దశాబ్దాలుగా విప్లవం కోసమే జీవించి, విప్లవోద్యమ నిర్మాణంలోనే జులై 12,
1984 లో తన తుదిశ్వాశ విడిచి అమ
రులైనారు.
అంతిమంగా, అర్థవలస, అర్దప్యూడల్
భూస్వామ్య, వ్యవసాయక దేశమైన
మన దేశంలో ” వ్యవసాయక విప్లవ
పంథా ” ఏనాడు అమలు జరగలేదు.
ఉభయ కమ్యూనిస్టులు భారతదేశ
సామాజిక విప్లవానికి తిలోదకాలిచ్చి,
పార్లమెంటరీ పంథా, పాలక వర్గాలకు
రాజకీయ మద్దతు దారులుగా కొన
సాగుతున్న పరిస్థితి వుండగా,
మార్క్సిజం – లెనినిజం , మావో అలోన విధానం పేరుతో బలమైన
పిడివాదం కొనసాగుతున్నది.
కమ్యూనిస్టు విప్లవ కారులు తమ సుదీర్ఘ విప్లవ రాజకీయ జీవితం తరువాత వారిలో ఒక ” స్టాగినేషన్ ”
ఏర్పడింది. ఫలితంగా విప్లవ పునాదు
ల మీద స్థిరమైన వ్యవసాయక విప్లవ ప్రజాఉద్యమ నిర్మాణం జరగడం లేదు.
మావోయిస్టుల ఈనాటికి అతివాద దుస్సాహసిక పంథా కొనసాగిస్తూ, అనేక ఎదురు దెబ్బలు తింటున్నారు.
” సామాజిక విప్లవాన్ని కమ్యూనిస్టులు
మాత్రమే తెలేరు. విప్లవ ప్రజాఉద్య
మాన్ని నిర్మించి, విప్లవానికి, ప్రజల సాయుధ పోరాటానికి నాయకత్వం
వహిస్తారు ” ( కా, డి.వి )
భారత కమ్యూనిస్టు ఉద్యమం అందించిన, అత్యున్న కమ్య్యూనిస్టు
విలువలకు,సంప్రదాయాలకు, నిలువు
టద్దంలా నిలచిన కమ్యూనిస్టు విప్లవ
కారుల అగ్రనాయకులు, కామ్రేడ్స్ దేవులపల్లి, వెంకటే శ్వరరావు,
తరిమెల, నాగిరెడ్డి సమిష్టి కృషి ఫలి
తంగా సమగ్ర వ్యవసాయక విప్లవ
పంథా రూపొందించ బడింది. ఇందులో
భాగమైన ” భూమి – ప్రజాస్వామ్యం –
స్వాతంత్ర్యం ” కేంద్ర నినాదం ఆధారం
గా ఈ దేశంలోని నిజమైన కమ్యునిస్టు విప్లవకారులు ఐక్యత సాధించాలి.
ఈ ఐక్యత దేశంలో వ్యవసాయక విప్లవోద్యమ నిర్మాణంలో పునరంకిత
మైన వారు, భారత జనతా ప్రజాతంత్ర విప్లవ లక్ష్యాలను పరిపూర్తి చేస్తారు.
భారత విప్లవం జయించి తీరుతుంది.
మార్క్సిజం – లెనినిజం, మావో ఆలో
చనా విధానం వర్ధిల్లాలి.
————–