విద్యార్ధి ఉద్యమకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
విద్యార్ధి ఉద్యమకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
250 గజాల ఇంటిస్థలం ఇవ్వాలి
త్వరలో విద్యార్ధి ఉద్యమకారుల గర్జన సభ
– తెలంగాణ విద్యార్ధి ఉద్యమకారులు
ఉస్మానియా యూనివర్సిటీ :
తెలంగాణ విద్యార్ధి ఉద్యమకారుల వేదిక చైర్మన్ కంచర్ల భద్రి ఆధ్వర్యంలో తార్నాకలోని ఉస్మానియా యూనివర్సిటీలో భవిష్యత్ కార్యాచరణ పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలువురు విద్యార్ధి ఉద్యమకారులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థుల ఉద్యమం మరువలేని ఘట్టం అని, స్వరాష్ట్రంలో విద్యార్ధి ఉద్యమకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం ఉదిమకాలను విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. తెలంగాణ ఉద్యమకాలను గుర్తించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని, 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులుఇవ్వాలని , సబ్సిడీ లోన్లు ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేశారు. అదే విధంగా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. తెలంగాణ విద్యార్ధి ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం త్వరలో ఎమ్మెల్యే, ఎంపీ లకు వినతి పత్రాలు అందజేస్తామని, అన్ని యూనివర్సిటీల్లో పర్యటించి, విద్యార్ధి ఉద్యమకారుల గర్జన సభను నిర్వహిస్తామని సమావేశంలో ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మందాల భాస్కర్, రవీందర్ నాయక్, పంతకాల శ్రీనివాస్, సునీల్ శెట్టి, పుదారి హరీష్ గౌడ్, కృష్ణలత, దర్శన్, గడ్డం శ్రీనివాస్, స్వామి గౌడ్ లావణ్య, పర్షురాజ్, ధనలక్ష్మి, ఎస్ ఎన్ ఆర్, పెంచల సతీష్, పుట్ట రంజిత్, వేదాంత మౌర్య, దర్శనం జానూ, కే రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.