మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలగొని రేఖ గౌడ్ నియామకం

0

మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాలగొని రేఖ గౌడ్ నియామకం

రేఖా గౌడ్ కు ఘన సన్మానం చేసిన గౌడ సంఘం నాయకులు

హైదరాబాద్, ఆర్ పీ న్యూస్:

హైదరాబాద్ నాగోల్ లోని గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం ప్రజ్ఞాపూర్ కు చెందిన శ్రీమతి బాలగొని రేఖ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ గౌడ మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు గా గౌడ మహిళ కోసం కల్లు గీత వృత్తి రక్షణ కోసం, గౌడ కులస్తుల సమస్యలపై పోరాడుతున్నందున వారి సేవలను గౌడ సామజిక వర్గం కోసం మరింత ఉపయోగపడాలనే దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ (మహిళ)గా నూతనంగా జాతీయ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సాగౌడ్, జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ది రాములు గౌడ్, జాతీయ కోశాధికారి ఏ వి బాలేషం గౌడ్, జాతీయ ఉపాధ్యక్షులు ముత్యం నర్సింలు గౌడ్, రాష్ట్ర సీనియర్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి హైకోర్టు న్యాయవాది బాలసాని సురేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ లు కలిసి నియమించడం జరిగింది.
నూతనంగా నియామకం ఐన బాలాగోని రేఖ గౌడ్ కు పుష్ప గుచ్చం శాలువాలతో జాతీయ, రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మాణించడం జరిగింది.
ఈ కార్యక్రమంలొ సిద్దిపేట, మహబూబాబాద్, కొమురం బీమ్ ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల అధ్యక్షులు పచ్చిమడ్ల స్వామి గౌడ్, ముంజాల రాజేందర్ గౌడ్, కొండ్ర మనోహర్ గౌడ్, గొల్లపల్లి సాయగౌడ్,రాష్ట్ర నాయకురాలు మక్తాల శైలజ గౌడ్, రాష్ట్ర నాయకులు కదిరే ఆంజనేయులు గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, మెరుగు క్రిష్ణ గౌడ్, కుంచ సాయి కిరణ్ గౌడ్, ఊరు గొండ శేఖర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *