పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానించిన తాజా మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు
పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానించిన తాజా మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు
సిద్దిపేట, ఆర్ పీ న్యూస్:
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ఎంపీటీసీ ఆంజనేయులు తన పదవికాలం ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్మికుల కాళ్లుకడిగి వారికి నూతన పాదరక్షలను తొడిగి, వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పారిశుద్య కార్మికుల సేవలు మరువలేమని వారికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువేనని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులు లేనిదే గ్రామం పరిశుభ్రంగా ఉండదని, ఎంపీటీసీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గాని గ్రామప్రజలు గెలిపించి ఆశీర్వదించారని, తనను నమ్మి ఎంపీటీసీగా గెలిపించిన మర్పడగ గ్రామప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే పదవులు ఉంటాయని నాయకులకు సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే గ్రామ ప్రజలు రాజకీయాల్లో పునర్జన్మనిచ్చారని,దేశ ప్రధాని నరేంద్రమోధీ,రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంలో ముందుకు వెళ్తానని అన్నారు.