సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహమే ! గోలి కృష్ణ

0

 

      సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహమే !

గోలి. కృష్ణ ~ 944179645

 

1946 – 51 సం: రాల కాలంలో త్యాగధనులైన ఉమ్మడి కమ్యూనిస్టుల నాయకత్వంలో, నాటి నిజాం నవాబు నిరంకుశ ప్యూడల్ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు సాగించిన విరోచిత రైతాంగం సాయుధ పోరాటం

జరిగినది చరిత్ర విదితమే. ఐదు సం:రాలు కొనసాగిన పోరాటం ప్రపంచ సాయుధ పోరాట చరిత్రలో సువర్ణా

క్షారాలతో లిఖించబడింది.ఈ నేపథ్యంలో తెలంగాణా సాయుధపోరాటానికి, సెప్టెంబర్ 17 పోలీసు చర్య అనబడే నెహ్రూ సైన్యాలు, ఫ్యూడల్ నిజాం నవాబ్ దౌర్జన్యాలనుండి సంస్థాన ప్రజల విముక్తి పేరుతో,సంస్థాన ప్రజల పై జరిపిన దారుణమారణ ఖాండ, సాయుధ పోరాట పై వామపక్ష వాదులైన ఉభయ కమ్యూనిస్టుల వైఖరి, పాలక వర్గ పార్టీ బిజెపి,

కాంగ్రెసు వాదనలు, వాస్తవాలు…..

ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీనాయకత్వంలో 1940 నుండి నిజాం సంస్థానంలో ఆంధ్ర మహాసభ ద్వారా

విప్లవ రాజకీయ కార్యకలాపాలు కొనసాగినాయి. ఈ కార్యకలాపాల్లో క్షేత్రస్థాయి ప్రజా ఉద్యమ నిర్మాణంలో

మొదటగా ఆనాటి నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా వున్న కామ్రేడ్,దేవులపల్లి వెంకటేశ్వరరావు( డి.వి)ఈ జిల్లానుంచి మొదలు పెట్టినారు.సూర్యాపేట తాలూకా కేంద్రం1940 లో

ప్యూడల్ భూస్వాముల ” వెట్టిచాకిరి “వ్యతిరేకంగా 600 మందిని సమీకరించి ధర్నా కార్యక్రమం నిర్వహించీనారు. ఆ క్రమంలో నల్లగొండ జిల్లాలో భూస్వాములు దోపిడీ దౌర్జన్యాలు,వెట్టి చాకిరి ఏ విధంగా కొనసాగుతుందనే అంశాలు వివిధ గ్రామాలు తిరిగిపరిశీలించినారు. వీటి వ్యతిరేకంగాప్రజలు పోరాడాలి అనే అంశాలను వివరిస్తూ కరపత్రం వేసినారు. ఆ కరపత్రాన్ని సంస్థానంలో నిజాం ప్రభుత్వంనిషేదించింది.తెలంగాణా విప్లవ ప్రజా ఉద్యమమం ఆనాటి నల్లగొండ జిల్లాలో అనేక గ్రామాలకు విస్తరించింది. ఆ విస్తరణలోవేలాది మంది కార్యకర్తలు ఉద్యమంలోకి సమీకరించ బడిననారు. అలాంటి వారిలో బి.యన్.రెడ్డి ఒకరు. కా, డి.వి. ప్రోత్సాహం, రాజకీయ కృషి తో రాష్ట్ర స్థాయి నాయకుడిగా అభివృద్ది ఐనారు. కా,బి.యన్ రెడ్డి విప్లవప్రజాఉద్యమ విస్తరణ, సాయుధ

పోరాట అభివృద్ధిలో కీలక పాత్ర నిర్వహించి, సాయుధపోరాట యోధుడుగా గుర్తిపు ప్రజల గుండెల్లో చిరస్థాయిగాని లిచినారు.1946 జులై 4 న కడవెండి గ్రామంలోవలంటీర్లు ఊరేగింపు మీద ఇస్నూర్ దేశ్ ముఖ్ గుండా మస్కత్ అలి కాల్పుల్లో తెలంగాణా విప్లవ ప్రజా

ఉద్యమ తొలి అమరుడు దొడ్డి, కొమరయ్య అమరత్వంతో విప్లవ ప్రజాఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.

ఆ క్రమంలోనే ప్యూడల్ భూస్వాములుఅక్రమ వసూళ్లు, వారి భూములను స్వాదీనం చేసుకొని వ్యవసాయ విప్లవ

కార్యక్రమాన్ని అమలు జరిపినారు.పంచుకున్న భూములను రక్షణకోసం తెలంగాణా రైతులు ఆయుధం పట్టి సాయుధ పోరాటం సాగించినారు.

ఈ సాయుధ పోరాటం అనేక ఆటుపోట్లు, ఎగుడు, దిగుడుల మధ్య అభివృద్ధి చెంది పురోగమించింది. వ్యవ

సాయక విప్లవం అమలు పరచడంద్వారా, పదిలక్షల ఎకరాల భూమి పంపకం, మూడు వేలగ్రామాల్లో

గ్రామరాజ్యాలు, ( గ్రామ సోవియట్లు ) ఏర్పడినాయి.

తెలంగాణా సాయుధ పోరాటం, వ్యవసాయక విప్లవంలో ” దున్నే వానికి -భూమి లభించడం ద్వారా ఇన్ని వేల

సం: రాల కాలంలో ప్రజల జీవితంలోకొత్తమార్పులు చోటుచేసుకొన్నాయి.వ్యవసాయక విప్లవం అమలు జరిగిన తెలంగాణా పల్లెల్లో ప్రజలు మొదటిసారిగా రెండు పూటలా అన్నం తిని,వంటినిండా బట్టలు కట్టుకొని, తల

ఎత్తుకొని ఒక ఆత్మ గౌరవంతో జీవించడం మొదలు పెట్టినారు.అంతేకాకుండా వ్యవసాయక విప్లవం,సాయుధ పోరాటం తెలంగాణా ప్రజల్లోతెచ్చిన మౌలిక మార్పులు ఏమంటే !కొత్తగ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటైంది. మూడువేల గ్రామాస్వారాజాలు ఏర్పడడం ద్వారా వాటిల్లో కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. జీతపు రాళ్ళకోసం పనిచేసే పోలీసు వ్యవస్థలా కాకుండా, తమ భూమిని, ఇళ్లను కాపాడుకోవడానికి ప్రజల బిడ్డలతో ఏర్పడిన కొత్త

” సాయుధ గెరిల్లా దళాల మిలటరి “వ్యవస్థ ఏర్పడింది.

తెలంగాణా సాయుధ పోరాటం ప్రజలజీవితాల్లో తీసుకు వచ్చినమరో మౌలికమార్పులు ఏమంటే! నూతన ఆర్థిక,

రాజకీయ జీవితంతో పాటు, కొత్తసాంస్కృతిక జీవితం ఏర్పాటు మొదలైంది. దొంగ తనాలు లేకపోవడం, అందరూ చదువుకోవడం, స్త్రీలు అన్నిరంగాల్లో తమ చైతన్యానికి, నిర్మాణానికి అనుగుణ్యంగా ముందుకు రావడం జరిగింది. అంతేకాకుండా కష్టించి పని చేయడం

వంటి అత్యున్నతమైన సంస్కృతి,నీతి సూత్రాలు ఏర్పడిన విప్లవదశ అది. ఈనూతన ప్రజాతంత్ర విప్లవ

సంస్కృతి దశ అంటే పుస్తకాలలో మాత్రమే చదివి ఊహించుకోగలం.కానీ తెలంగాణా సాయుధ పోరాట కాలంలో 1947 సెప్టెంబర్, అక్టోబర్ నుండి మొదలు కొని1948 సెప్టెంబర్ నాటి వరకు సంస్థానంలో వ్యవసాయకవిప్లవోద్యమం అమలు జరిగిన గ్రామా

ల్లో ఏర్పడిన భౌతిక విప్లవ దశను ప్రజలు కొత్తగా చవి చూసినారు.తెలంగాణా సంస్థానంలో కమ్యునిస్టు

విప్లవ దళాల ధాటికి తట్టుకోలేక నిజాం రజార్ కార్ మూకలు, సైన్యాలుపలాయనం చిత్తగిస్తు ఓటమి అంచు

ల్లో ఉన్నదశ అది. కమ్యూనిస్టుల నాయకత్వంలో విప్లవ సాయుధ పోరాటం ముందుకు పోవడం చూసిన

బ్రిటీష్ వారు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినారు. ఈ సంస్థానం ఇంకెంత మాత్రం స్వతంత్రంగా ఉండలేదని, దీన్ని కమ్యూనిస్టుల వశం కాకుండా,నిజాం కాపాడలేదనే నిర్దారణకు వచ్చినారు. స్వతంత్రంగా ఉండటమంటే కమ్యూనిస్టుల నాయకత్వంలో విప్లవోద్యమం ముందుకుపోయి హైద్రాబాద్ కూడా చేతిలో లేకుండా పోతుందని గ్రహించినారు.ఈ అంశాన్ని ఆనాటి గవర్నర్ జనరల్ గా వున్న మౌంట్ బాటెన్ ద్వారా, ఇతరత్రా నిజాం నవాబుకు భారత యూనియన్లో చెరవల్సిందేనని నిజాం నవాబ్కు స్పష్టం చేసినారు. ప్రతిగా నిజాం నవాబ్ ఎదోఒక విధంగా తన స్వాతం-త్ర్యాన్ని ” ఒకమేరకైన ” నిలబెట్టు

కొనేందుకు యూనియన్ ప్రభుత్వాన్నిఒప్పించమని బ్రిటీష్ వారిని ప్రాదేయపడిన విషయాలు, అందుకు బ్రిటీష్

ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ‘ ఫ్రీడమ్ఎట్ మిడ్ నైట్ ‘ అనే ఇంగ్లీషు పుస్తకంలో స్పష్టం చేసినారు. ( కా.డి.వి. )

కమ్యూనిస్టు విప్లవ దళాల నాయకత్వంలో పురోగమిస్తున్న ప్యూడల్ భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటాన్ని ఈ దశలో ఉపేక్షిస్తే, సంస్థానంలో భాగంగా ఉన్న మరట్వాడ ( మహారాష్ట్ర ) ఇటు రాయచూరు, బీదర్, గుల్బర్గా, ( కర్నాటక ) దేశ వ్యాప్తంగా విస్తరించే ప్రమాదం వుందని బ్రిటీష్ ప్రభువులు అంచనా వేసినారు.

నెహ్రూప్రభుత్వానికి ఈ పరిణామాల పై వెంటనే చర్యలకు ఉపక్రమించాలనేసలహా ఇచ్చినారు. వారి సలహా, సూచనలను నెహ్రూ ప్రభుత్వం అంగీకరించి చర్యలకు ఉపక్రమించింది.ఈ నేపథ్యంలో నిజాం ప్యూడల్ నిరంకుశ పాలనుండి సంస్థానంలోనిప్రజలకు విముక్తి కలిగించి శాంతి,భద్రతలను కాపాడుతామనే నెపంతోనెహ్రూ, హోమ్ మంత్రిగా ఉన్న పటేల్ ద్వయం నిర్ణయం తీసుకొన్నారు. 50వేల యూనియన్ సైన్యాలను సంస్థానంలోకి మూడు ప్రాంతాలనుండి, వారి నిర్ణయం మేరకు సెప్టెంబర్ 13 న

సంస్థానంలో ప్రవేశించినాయి.గమనించాల్సి అంశం ఏమంటే, భారత దేశంలో ఆనాటి సంస్థానాలన్ని చట్టబద్ద, స్వాతంత్రత కలిగినవి. వీటిమీదికి సైన్యాలను పంపడం మంటేఅంతర్జాతీయ నియమాల ప్రకారంఅది ఒక దురాక్రమణ చర్యే అవుతుంది. అంతర్జాతీయంగా వచ్చే ఈఅపవాదు నుండి తప్పించుకోవడంకోసం నెహ్రూ ప్రభుత్వం తీసుకొన్నఈ సైనిక చర్యను ” శాంతి భద్రతలను

కాపాడే పోలీసు “చర్యగా ” చూపెట్టిఅంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవపట్టించినారు.నిజాం నిరంకుశ పాలననుండి సంస్థానప్రజలను విముక్తి కలిగించడానికి, వచ్చిన ” విముక్తి దాతలు ” గా చెప్పుకొంటున్న యూనియన్ సైన్యాలుసంస్థానంలో ఏం చేశాయి ? మొదటగా కమ్యూనిస్టులు నాయకత్వంలో వ్యవ

సాయ విప్లవం, భూమి పంపిణీ పెద్దెత్తున అమలు జరిగిన విప్లవ కేంద్రాలుగా వున్న గ్రామాలను చుట్టూ ముట్టినాయి.

పార్టీ గ్రామ కమిటీ నాయకులను, విప్లవ గెరిల్లాలను ఎక్కబడితే అక్కడ,దొరికిన వారిని, దొరికినట్లు పిట్టల్లా

కాల్చివేసినారు. అప్పటి వరకు విప్లవ గెరిల్లాల సంచారంతో బయకంపితులై గ్రామాలను వదిలి పట్టణాలకు పారిపోయిన భూస్వాములను నెహ్రూ సైన్యాలు తిరిగి గ్రామాల్లో పునర్ ప్రతిస్టింప చేసినారు. అప్పటివరకు రూమిటోపీలు ధరించిన భూస్వాము

లు ఖద్దర్ బట్టలతో ప్రత్యక్ష మైనారు. తెలంగాణ పల్లెల్లో ప్యూడల్ భూస్వాముల రాజ్యాన్ని తిరిగి నెలకొల్పారు.

విప్లవోద్యమాలను అణచి వేయడమేమిలటరీ యాక్షన్ ప్రధాన లక్ష్యమనేఅంశం స్పష్టమై పోయింది.

ఈ విముక్తి దాతలు నిజాం సాయుధరజాకారు మూకలలు సాగించిన దౌర్జన్యాలు, అరెస్టులు ఏ మాత్రం తీసిపోని విధంగా అమలు జరిపినారు.స్త్రీలను చర్చడం, గ్రామాలకు, గ్రామాలేతగలబెట్టడం లాంటి ఆకృత్యాలెన్నో

చేసినారు. నిజాం సాయుధ రజాకార్ల,ప్యూడల్ భూస్వాముల దౌర్జన్యాలనుండి కాపాడానికి వచ్చిన ” శాంతిదూత ” లైన నెహ్రూ సైన్యాలు, సంస్థానంలో శాంతి నెలకొల్పడమే నిజమైందిఅయితే, పైనపేర్కొన్న దారుణ మారణఖాండకు, ఫాసిస్టు చర్యలకు ఎలా ఒడి

గట్టినారు ?నిజాం సాయుధపోరులో కంటే, నెహ్రూ

సైన్యాల చేతిలోనే అత్యధిక సంఖ్యలో విప్లవ గెల్లాలు వీర మరణం పొందినారు. యూనియన్ సైన్యాలరాకతో సంస్థాన ప్రజలకు విముక్తి కలిగిందని భావిస్తున్న మేదావులు, అకడమిక్చరిత్రకారులు, ప్రచార సాధనాలు,

తెలంగాణా సాయుధపోరాట చరిత్రలో పోలీసు చర్య పేరుతో నెహ్రూ సైన్యాలు జరిపిన అమానుష దమన కాండను గుర్తించాలి. ఈ కాలమంతటా ఆంధ్ర కమ్యునిస్టుపార్టీ కామ్రేడ్స్ చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్యలు నాయకత్వ బాధ్యతల్లో వుంటూ ఆంధ్ర నుండి సాయుధ పోరాటం , తీవ్ర నిర్భంద సమయంలో అనేక విధాలుగా తోడ్పడినారు.కాగా మిలటరీ చర్యతో పార్టీలో నెలకొని వున్న ఆంతరంగిక పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఉభయ కమ్యూనిస్టులలో ప్రస్తుత సీపీఐ పార్టీ ఆనాటినాయకత్వం, యూనియన్ సైన్యాల రాకను స్వాగతించింది. ప్యూడల్ నిరంకుశ నిజాం నవాబును లొంగదీసుకొనుటకు, అభ్యుదయ కాముకుడు, ప్యూడల్ వ్యతిరేకి నెహ్రూ, పటేల్ తీసుకున్న మిలటరీ చర్యను

అభ్యుదయ, వాంఛనీయ చర్యగా ప్రకటించారు. నిజాం నిరంకుశ పాలననుండి తెలంగాణా ప్రజలు ” విముక్తి ”

పొందిన రోజుగా సెప్టెంబర్ 17 నునిర్ణయిస్తూ తీర్మానం చేసింది.1948 సెప్టెంబర్ 17 లో తెలంగాణసాయుధ పోరాటం విరమించి వుంటేపెద్ద ద్రోహమే జరిగి వుండేది. పోరాటంలో సాధించిన విప్లవ విజయాల రక్షణకోసం 1948 సెప్టెంబర్ నుండి 1951అక్టోబర్ దాకా సాయుధ పోరాటంకొనసాగించిచడం సరైన చర్యగా,

సెప్టెంబర్ 17 భారత్ యూనియన్ లో” విలీనమైన ” రోజుగా ఆనాటి, ప్రస్తుతసీ పీఎం నాయకుల వాదనలు.

మరో ముఖ్యమైన అంశం ఏమంటే !1948 ఫిబ్రవరిలో జరిగిన పార్టీ రెండవమహా సభలలో పిషి జోషి వర్గానికి

వ్యతిరేకంగా, బి.టి. రణదివ్వే వర్గంతెలంగాణ సాయుధ పోరాటం కొనసాగించాలనే వాదాన్ని ఉపయోగించు

కొని పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి బాధ్యతలను చేపట్టినారు.1948నుండి కొనసాగుతున్న తెలంగాణా సాయుధ పోరాటం, దేశంలో కొనసాగుతున్న ప్యూడల్ దోపిడీ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దేశ వ్యాపి

తంగా విస్తరింపచేసి, జనతా ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేయాలనే లక్ష్యాలతో ” ఆంధ్రతీసిస్ ” అనే డాక్యుమెంట్ పొలిటిబ్యూరోకు పంపించినారు.

ఆంధ్రతీసిస్ పూర్తిగా ఆర్థిక వాదంతోకూడుకొన్నదని తిరస్కరించి, బి.టి.రణదివ్వే ” సాయుధ తిరుగు బాటు ”

రష్యా పంథాను ప్రవేశ పెట్టినారు. రణదివ్వే పంథాగా పేరొందిన దాన్నిసీపీఎం పార్టీ తమ అధికార పంథాగా

చెప్పుకొనే వారు. అయినప్పటికీ సీపీఎం పార్టీ ఆ పంథాను అమలు జరిపిన దాఖలాలు దేశంలో ఎక్కడ కనిపించవు.

సాయుధ తిరుగు బాటు పంథా,కార్మిక వర్గం సాయుధ తిరుగుబాటు చేసే నిర్దిష్ట పరిస్థితులులేవు కాబట్టి,

ఆ పరిస్థితులు ఏర్పడేదాకా వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు. బూర్జువా ఉదారవాద సిద్ధాంతంతో పాలక, పార్లమెంటరీ పార్టీలతో ఎన్నికల పొత్తులు, ప్రంట్లు కడుతున్నారు.వర్గ సమాజంలో కమ్యూనిస్టులు

బుర్జువాలకు సమాధాన వాదులు. రాజీ వాదులు ఎంతమాత్రం కారు.కాగా, నెహ్రూ అభ్యుదయవాదం, ఆయన సోషలిజం మీద భ్రమలు పెంచుకొన్న పార్టీ కేంద్రకమిటీ నాయకులు, కొందరు రాష్ట్ర కమిటీ నాయకుల

తో కలిసి చారిత్రాత్మకమైన తెలంగాణాసాయుధ పోరాట విరమణ 1951అక్టోబర్ 1 న ఆలిండియా రేడియోలో

ప్రకటన ఇప్పించినారు. సాయుధ పోరాట నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ డి.వి.

బి.యన్.రెడ్డి అంగీకారం లేకుండా విరమణ ప్రకటన ఇప్పించినారు. అటవీ ప్రాంతంలో సాయుధ గెరిల్లాల

తో ఉన్న వారివురికి పోరాట విరమణ ప్రకటన రేడియో ద్వారా మాత్రమేతెలిసింది. నాలుగు వేలమంది మృతవీరుల త్యాగపలంతో ఎరుపెక్కిన తెలంగాణ సాయుధ పోరాటం ఉభయ కమ్యూనిస్టుల విద్రోహకర పాత్రమూలంగా తమ లక్ష్యాలు సాదించకుండానే ముగిసింది.శ్రీ రావి నారాయణరెడ్డి నాయకత్వంలో సీపీఐ పార్టీ 1948 నుండి 51 దాకా జరిగిన సాయుధ పోరాటాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం పైన గమనించాం.అదే సమయంలో సాయుధ పోరాటవ్యతిరేకులందరిని కూడాగట్టి వారికినాయకత్వం వహించినారు. నాయకత్వం వహించడమే కాకుండా ఆనాటి బొంబాయిలో మితవాద నాయకుడు శ్రీ డాంగే గారు, సాయుధ పోరాటానికి వ్యతిరంగా ఏర్పాటు చేసిన ” ఓపెన్ పొరం ” లో చేరి సాయుధ పోరాటం పై శత్రువులు కూడా చేయనటువంటి విష ప్రచారం చేసినారు.1948 సెప్టెంబర్ లో ఆనాటి సీపీఐ నాయకత్వం యొక్క విద్రొహ కరమైన పాత్ర, మరియు

” తెలంగాణా సాయుధ పోరాట యోధుడిగా ” శ్రీ రావి నారాయణరెడ్డి గారిని పాలకులు ప్రచార సాధనాలు, అకడమిక్ చరిత్ర కారులు కీర్తిస్తూ వుంటారు. ఈ దంత నాటి చారిత్రక వాస్తవాలను తల క్రిందులు చేస్తూ ప్రజల పక్కదోవ పట్టించే ప్రచారమే. ఉభయ కమ్యూనిస్టులు ఆనాడు, ఈనాటికి కూడా అభ్యుదయ కాముకుడుప్యూడల్ వతిరేకిగా నెహ్రూ గారికి

ప్రశంషల జల్లులు కురిపిస్తున్న పరిస్థితి ఆ పార్టీల్లో కొనసాగుతున్నది. ఆయనప్యూడల్ వ్యతిరేకత ఎంత బూటకమైనదో నిజాం నవాబ్ కు కలిపించినచట్టబద్ద హోదా, సౌకర్యాలను పరిశీలించితే అర్థమౌతుంది.

భారత రాజ్యాంగం లోని 294, 362, 363, 366 లకు లోబడి దేశం లోని ప్యూడల్ మహారాజులు, సంస్థనాదీసులకు ” రాజ బరణాలు ” వాటితోపాటు ఇతర సౌకర్యాలు రాజ్యంగ బద్దంగానే కలిపించినారు. ( కౌంటర్ కరెన్సీ రామకృష్ణ ) అంతే కాకుండానిజాంకు పెద్దఎత్తున భూములు,ప్రజాధనం, సం: రానికి 50 లక్షలగౌరవ వేతనం ఇచ్చే ఏర్పాట్లు చట్టబద్దంగానే కలిపించినారు.మరో ముఖ్యమైన అంశం ఏమంటే ” రాజ్ ప్రముఖ్ ” హోదాను ఇచ్చి సత్కటిరించినారు. ఉభయ కమ్యూనిస్టులు కలిసి ప్రచారం చేస్తున్నట్లుగా, నిజాంను లొంగదీసుకొనటం, ప్యూడల్ వ్యతిరేకతే నిజమైనది అయితే, నెహ్రూ

ప్రభుత్వం పై చర్యలు తీసుకొనడంఎలా సాధ్యం ? ఉభయ కమ్యునిస్టు శ్రేణులు గమనించాలి.కమ్యూనిస్టు విప్లవ కారుల నాయకులు, సాయుధ పోరాట రూపశిల్పికామ్రేడ్ డి. వి. అభిప్రాయం ఏమంటే,తెలంగాణ సాయుధ పోరాటం భావిభారత విప్లవానికి ఒక ప్రయోగశాలవంటిది. అది ఎన్నో అమూల్యమైన గుణపాఠాలు అందించింది. తెలంగాణా సాయుధ అనుభవాలగురించి దేశంలోని వివిధ యం.యల్గ్రూపులు అదొక వీరోచిత పోరాటమని

పొగుడుతూ, ఆ పోరాట విప్లవానుభవాలు అక్కడే వదిలి వేస్తారు. భారతసామాజిక విప్లవానికి తిలోదకాలు

ఇచ్చిన ఉభయ కమ్యూనిస్టులు సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు.

విస్తుతి గొలిపే అంశం ఏమంటే !

” సంస్థాన ప్రజలను నిజాం దాస్టికాల నుండి విముక్తి కలిగించాలనే పేరుతో నెహ్రూ సైన్యాలు, నాలుగు వేల మంది విప్లవ గెరిల్లాను, గ్రామకమిటి నాయకులను పిట్టల్లా కాల్చి, తెలంగాణా గడ్డ మీద రక్తం పారించిన రోజు సెప్టెంబర్ 17. ఈ లాంటి ఫాసిస్టు రోజును ఉభయ కమ్యూనిస్టులు వారోత్సవాలుగా నిర్వహించమని తమ శ్రేణులకు పిలుపునివడం, తమపాలకవర్గ, పార్లమెంటరీ రాజకీయ దృక్పథానికి పరాకాష్ట తప్ప మరొకటి కాదు.చరిత్రలో పాలక వర్గాలు తమమీద జరిపిన మారణహోమాన్ని నిరసిస్తూ,కార్యక్రమాలను చేపట్టడం సుస్తాం. అందుకు భిన్నంగా మనదేశంలో ఉభయ కమ్యూనిస్టులు ” వారోత్సవాలను ” జరుపడం ప్రపంచ కమ్యునిస్టు ఉద్యమ చరిత్రలో మరెక్కడా జరుగలేదు. ఈ లాంటి వీరు తెలంగాణా సాయుధ పోరాటానికి, అమర వీరులకు” వారసులు ” ఎలా అవుతారు ?

దేశంలో మతవాద రాజకీయాలతోప్రజల భావోద్యోగాలను రెచ్చగొడుతూ,అధికారంలో కొనసాగుతుంది. తెలంగాణా సాయుధ పోరాటం కాలంలో కంటికి కపించని బిజిపే తెలంగాణా రాష్ట్రంలో అధికారం కోసం, సాయుధ పోరాటాన్ని హిందూ – ముస్లిం మధ్య జరిగిన పోరాటంగా చిత్రించి హిందూ

ఓట్లను కొల్లగొట్టే కుట్ర రాజకీయాల్లోభాగమే. సంస్థానంలో అత్యధికంగా హిందూ ప్యూడల్ భూస్వామ్య వర్గాలే శ్రామిక ప్రజల మీద దౌర్జన్యఖాండ అమలు జరిపింది.అంతిమంగా, భారత దేశ సామాజిక విప్లవానికి మార్గం చూపిన తెలంగాణ సాయుధ పోరాటానికి తిలోదకాలు ఇచ్చి, పార్లమెంటరీ రాజకీయాల్లో పీకలదాక కూరుకుపోయిన ఉభయ కమ్యూనిస్టులు సాయుధ పోరాటవారసులు ఎన్నటికీ కాలేరని, కాజాలరనేది సుస్పష్టం.తమ వర్గ సంకర రాజకీయాలతో సెప్టెంబర్ 17 ను ” విముక్తి ” దినమని సిపిఐ పార్టీ, ” విలీన ” దినమని సీపీఎం పార్టీ వారు సూత్రీకరించినారు.తెలంగాణా సాయుధ పోపరాట విప్లవానుభవాలను స్వీకరించి దేశంలో జనతా ప్రజాతంత్ర విప్లవ కర్తవ్యాలను పరిపూర్తి చేయడానికి కంకణ బద్దులైవున్న కమ్యూనిస్టు విప్లవ కారులే ఆ పోరాటానికి నిజమైన వారసులు కాగలుగుతారు. సంస్థానంలో వ్యవసాయక విప్లవోద్యమాన్ని రక్తపుటేరుల్లో ముంచిన సెప్టెంబర్ 17 కమ్యునిస్టు విప్లవకారుల దృష్టిలో ముమ్మాటికీ” విద్రోహ “దినమే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *