రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి
రైలు నుండి జారిపడి ఓ వ్యక్తి మృతి
సికింద్రాబాద్, ఆర్ పీ న్యూస్ :
మౌలాలి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుండి దిగబోతు ఒక వ్యక్తి చనిపోయినాడు అని తేదీ 24/07/2024 రోజున19.40 గంటలకు డిప్యూటీ ఎస్.ఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి వెళ్లి విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పాత పాల్వంచ కు చెందిన షేక్ మొహమ్మద్ ఆసిఫ్ హైదరాబాద్ లోని చైతన్యపురి లో నివసిస్తూ చైతన్యపురిలో గల ఓమ్ని ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. అతను గత కొన్ని రోజుల నుండి జ్వరంతో బాధపడుతుండగా హైదరాబాదులోనే బిటెక్ చదువుతున్న అతని అన్న అతడిని తమ స్వగ్రామమైన పాత పాల్వంచకు తీసుకెళ్లడానికి కాకతీయ ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వేషన్ చేయించినాడు. తేదీ 24-07-2024 రోజు సాయంత్రం అన్నదమ్ములు ఇరువురు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకొని మూడో నెంబర్ ప్లాట్ఫారం మీద ఉన్న కాకతీయ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి బదులుగా పొరపాటున రెండవ నెంబర్ ప్లాట్ఫారంపై నుండి కదులుతున్న చెన్నై ఎక్స్ప్రెస్ రైలు ఎక్కినారు రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత తమ పొరపాటును తెలుసుకొని మౌలాలి రైల్వే స్టేషన్ మీదుగా రైలు వేగంగా వెళ్లేటప్పుడు రైలు నుండి క్రిందికి దిగటానికి ప్రయత్నం చేయగా షేక్ మొహమ్మద్ ఆసిఫ్ క్రిందికి దిగలేక క్రిందికి జారిపడగా తలకు, శరీరంలోని ఇతర ప్రదేశాలలో తీవ్ర గాయాలై తీవ్రమైన రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సికింద్రాబాద్ GRP పోలీసులు మృతదేహం ఆస్పత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.