రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు
రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు
సి ఐ రవీందర్ నాయక్ , ప్రజా ప్రతినిధులు..
ఎల్లారెడ్డి, ఆర్ పీ న్యూస్ : ఎల్లారెడ్డి మండలం లోని ఇటివిల జరుగుతున్న రోడ్డు రోడ్డు ప్రమాదలపై అధికారులు ప్రజా ప్రతినిధులు నివారణ చర్యలు చేపట్టారు. గురువారం రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు సంభవించిన ప్రదేశాలనుఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ మహేష్ , ఆర్ అండ్ బి డి ఈ నారాయణ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అయినటువంటి జెడ్పిటిసి ఉషా గౌడ్ , ఎంపీపీ మాధవి , స్థానిక కౌన్సిలర్ లు మరియు గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సందర్శించి రోడ్డు ప్రమాదం కు గల కారణాలను విశ్లేషించి అక్కడ ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలకు పలు సూచనలను రిపోర్టుగా తయారు చేయడం జరిగింది. ఇట్టి రిపోర్ట్ ను సంబంధిత అధికారులకు పంపడం జరుగుతుందని తెలిపారు..