ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
రంగారెడ్డి, ఆర్ పీ న్యూస్ :
రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం అమానగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం – హైదరాబాద్ జాతీయ రహదారి పై ఆర్టీసీ బస్సు, కారు వేగంగా ఎదురుదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ మత్తులో ఉండటంతోనే ఈ ఘటన చోటుచేసుకుని ఉంటుందని సమాచారం. కాగా మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు.