రాష్ట్ర గీతం కూర్పు వ్యవహారం తో నాకు సంబంధం లేదు:సీఎం రేవంత్ రెడ్డి
– రాష్ట్ర గీతం కూర్పు వ్యవహారం తో నాకు సంబంధం లేదు
– ఆ బాధ్యతలు అందేశ్రీ కే వదిలేశా
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ఆర్ పీ న్యూస్:
రాష్ట్ర గీతం జయజయ హే తెలంగాణకు సంగీత కూర్పు వ్యవరంతో తనకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.ఎవరితో సంగీతం చేయించెకోవాలనే విషయాన్ని అందేశ్రీ కే వదిలేశానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం బాధ్యతను ఇతర రాష్ట్ర సంగీత దర్శకుడికి అందించడం పట్ల బీ ఆర్ ఎస్ చేసిన విమర్శల పై ఆయన స్పందించారు. జయజయ హే పాట రాసిన అందేశ్రీ కే గీతం రూప కల్పన బాధ్యతలు ఇచ్చామని, అందేశ్రీనే కీరవానిని ఎంపిక చేశారని వెల్లడించారు.