కొత్తగూడలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
నివాళులర్పించిన కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొత్తగూడ, ఆర్పి న్యూస్:
ములుగు అసెంబ్లీ మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క వారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో రాజీవ్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వజ్జ సారయ్య మాట్లాడుతూ… రాజీవ్ గాంధీ ఆగస్టు 20 1944 న వారి జననం 1984 నుండి 1989 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక భారతీయ రాజకీయ నాయకులు తన తల్లి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వారు ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు రాజీవ్ గాంధీ గారు 40 ఏళ్ల వయసులో భారత ప్రధాని అయ్యారు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు లోక్సభ నాయకుడు అయ్యాడు మే 21 1991న ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు ఐటీ రంగానికి పునాదుల వేసిన మహానుభావులు మార్గదర్శి దేశాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన ధ్రువతార మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ వారు సేవలను మర్చిపోలేము అంటూ వారి ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వారికి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు