రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేయాలి
షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేయాలి
– ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈసంపెల్లి బాబు
నర్సంపేట, ఆర్ పి న్యూస్:
షరతులు లేకుండా అర్హులైన రైతులకు 2,00,000 రుణ మాఫీ చేయాలని సీపీఎం పార్టీ ఆద్వర్యం లో ఈ రోజు నర్సంపేట లోని R.D.O. ఆఫీసు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ ఈసంపెల్లి బాబు మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ ప్రకారం గత నెలపదిహేను రోజులుగా రుణ మాఫీ ప్రక్రియ జరుగుతున్నదని , కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరతులవల్ల ఈ రోజువరకు 50శాతం రైతాంగానికి కూడా రుణ మాఫీ జరుగలేదని, రాష్ట్రం లో రుణ మాఫీకి అర్హులైన రైతులు 42లక్షలకు పైగా ఉన్నప్పటికీ ఈ రోజు వరకు సగం మంది రైతులకు రుణ మాఫీ అందలేదని అన్నారు, అర్హులైన రైతుల రుణాలు 31వేల కోట్లు ఉన్నప్పటికీ ఈ రోజు వరకు రైతుల ఖాతాల్లో 18వేల కోట్ల వరకు మాత్రమే జమ చేశారని, ప్రస్తుతం వివిధ రకాల ఆంక్షలతో అర్హులైన రైతులకు రుణమాఫీ అందడం లేదని, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ వర్తించడం లేదు, ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ 2లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు, తదనంతరం వివిధ డిమాండ్లతో R.D.O. కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమార స్వామి, జిల్లా కమిటీ సభ్యులు హన్మకొండ శ్రీధర్ , బోల్ల సాంబయ్య, మండల నాయకులు బుర్రి ఆంజనేయులు sk అన్వర్, పెండ్యాల సారయ్య, కట్కురి శ్రీనివాస రెడ్డి, కత్తి కట్టయ్య, కమతం వెంకటేశ్వర్లు, గడ్డమీది బాలకృష్ణ, లక్క రాజు, కలకోట అనిల్ వజ్జంతి విజయ, జగన్నాధం కార్తీక్, ఉదయగిరి నాగమణి,దాసరి నరేష్,ఇంద్ర, విలియం కేరి,యాక లక్ష్మి, రాజేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.