బెజుగామ లో రైతు రుణమాఫీ కుటుంబ నిర్ధారణ సర్వే

0

బెజుగామ లో రైతు రుణమాఫీ కుటుంబ నిర్ధారణ సర్వే

సిద్దిపేట, ఆర్ పి న్యూస్ :

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో గురువారం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి అర్హులు అయి ఉండి, రేషన్ కార్డు లేనివారు, ఆధార్ కార్డు లో తప్పులు, వివిధ కారణాల వల్ల రుణమాఫీ కానీ వారికి అవగాహన కార్యక్రమం వ్యవసాయ అధికారులు మాధవి,జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు చిటుకుల శివారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేసి ఎన్నికల హామీ మాట నిలబెట్టుకున్నారని,రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ వారు వ్యవసాయ అధికారులని సంప్రదించాలని సూచించారు రైతు రుణమాఫీ తో రైతులు సంతోషంగా ఉన్నారని బి ఆర్ ఎస్ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారని ప్రతి పక్షాల మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ భేరి మోగించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *