రైతు బీమా సద్వినియోగం -ఏఈఓ విష్ణువర్ధన్
రైతు బీమా సద్వినియోగం – ఏఈఓ విష్ణువర్ధన్
సిద్దిపేట, ఆర్ పి న్యూస్:
రైతు బీమా సద్వినియోగం చేసుకోవాలి అని ఏఈఓ విష్ణువర్థన్ అన్నారు బుదవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ రైతులు రైతు బీమా పత్రాలను అందజేసి రైతు బీమా నమోదు చేసుకోవాలని సూచించారు ఆగస్టు 4 వరకు రైతు బీమా పత్రాలు స్వీకరించడం జరుగుతుందని, ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు మరణానంతరం నామినీకి ఐదు లక్షలు రూపాయలు వచ్చే బృహత్తర పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.