పీడిత ప్రజల గుండె చప్పుడు రాధక్క
పీడిత ప్రజల గుండె చప్పుడు రాధక్క
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
కామ్రేడ్ అక్కినేని నిర్మల అలియాస్ రాధక్క సంస్మరణ సభ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మనకోసం కిషోర్ @మీర్పేట్ అధ్యక్షతన జరిగింది. వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు.డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రాధక్క నమ్మిన ఆశయం కోసం తుది వరకు కట్టుబడి ఉన్నారని అలాంటివారు ఎప్పటికీ వామపక్ష ఉద్యమానికి ఆదర్శమని వారి ఆశయం నెరవేరాలంటే, సైదాంతిక పోరాటం జరగాలని, వామపక్ష భావజాలం ప్రజలలో విస్తరించడం ద్వారా మాత్రమే దేశానికి ముంపుగానున్న ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కోగలమని, అదిసాధ్యం కావాలంటే, ఎర్రజెండాలన్నీ ఒక కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. కృష్ణ మోహన్ ప్రసంగిస్తూ కామ్రేడ్ రాధక్క విద్యార్థి ఉద్యమ నాయకురాలుగా స్టూడెంట్ ఫెడరేషన్ లో పనిచేశారని, తర్వాత మహిళా సంఘం, సీపీఐ(యం) నాయకురాలుగా కృష్ణా జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, తదనంతరం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి భావజాలానికి ఆకర్షితురాలై గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నాయకురాలుగా అడవి బిడ్డలకు పోడు వ్యవసాయం హక్కు కోసం పోరాడారని తెలిపారు. ఆరోగ్యం సహకరించకున్నా తన కుటుంబాన్ని వదిలి అడవుల్లో పేద ప్రజల కోసం పోరాడారని కొనియాడారు. ఆవిడ కోరుకున్న సమ సమాజం సాధించేందుకు వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని, భావజాల రంగంలో కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు మోత్కూరి నరహరి మాట్లాడుతూ వివిధ కారణాలవల్ల వామపక్ష ఉద్యమం చీలిపోయిందని, ఇది భారత విప్లవోద్యమానికి ఆటంకంగా తయారైందని పేర్కొన్నారు. అందరూ పోరాటంలో ఏకమైన నాడే మన దేశంలో విప్లవం సాధ్యమని, ఆ విధంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.తుపాకికి ఈరోజు కూడా దోపిడీ వ్యవస్థ భయపడుతుందని, కానీ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో మోటార్ సైకిల్ దారిని సైతం శాటిలైట్ ద్వారా కనుక్కునే సమయంలో అడవుల్లో అన్నల జాడ దొరికించుకోవడం ఈ దగా ప్రభుత్వానికి అంత కష్టం కాదని కావున దేశభక్తులైన అన్నలు జనజీవన స్రవంతిలోకి వచ్చి వామపక్ష ఉద్యమాల్లో పాల్గొని భారతదేశాన్ని . మనకోసం కిషోర్ పిలుపునిచ్చారు.