ప్రజా కళాకారుడు గద్దర్ రాజకీయాలపై  వ్యాఖ్య

0

ప్రజా కళాకారుడు గద్దర్ రాజకీయాలపై  వ్యాఖ్య

గోలి కృష్ణ 

9441796451

౼౼౼౼౼౼౼౼౼౼౼౼

విప్లవ,ప్రజకళా కారుడు గద్దర్ 6 – 8-2023 న అమరులైనారు. ఆయన మరణం పైఆయా విప్లవ సంస్థలు, వ్యక్తులు వారి, వారి దృక్పధంతో, సమీక్షలు, వ్యాసాలు రాస్తూ,సంతాప సభలు పెడుతూ తమ,తమ వ్యాఖ్యానాలను చేస్తూ వున్నారు. ఎందువల్లనంటే ఒక విప్లవ ప్రజా కళాకారుడిగా ఆయన ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలా కాలంపాటు తన ఆట,పాటలతో తెలంగాణ జానపద రూపాల్లో ప్రజల్లో చెరగని ముద్ర వేసి,ఒక ప్రభంజనాన్నే సృష్టించి నారానడంలోఎలాంటి అతి శయోక్తి లేదు.ఒక విప్లవ ప్రజా కళా కారుడిగా ఆయనసాహిత్య, కళారూపాలను అంచనా వేయడానికి ఎంతో వాస్తవిక విప్లవ దృక్పధం అవసరం. ఆయన మరణించి ఒక నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన గురించి చెప్పేవారంతా ఆయనను పొగుడుతున్న వారేఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకరిని అదే పనిగా పొగిడే వారు, లేదా నిందించే వారు ఆయన తప్పులను చూడలేరు. అదే సమయంలో విమర్శించే వారు సైతం ఆయన మొత్తం జీవితం కాక పోయిన,కొంతకాలమైన అందులోని విప్లవ స్ఫూర్తిని గుర్తించడం లేదు. పొగుడుతున్న వారిలో అత్యధికులు గతంలో విప్లవోద్యమంతో సంభందం ఉన్నవారు, కొందరు వివిధ కారణాలతో మాజీలైన వారు, వామపక్ష వాదులైన ఉబయ కమ్యూనిస్టులున్నారు.గద్దర్ లాంటి ప్రజాదరణ పొందిన కళాకారుడి గురించిన,పొగడ్తలు వింటే ఆయన అనురించిన విప్లవ రాజకీయాలు, విప్లవ జీవితానికి సంభందించి విమర్శించే అంశాలేమీ లేవా ? ఆనిపిస్తుంది. ఏది ఏమైన గద్దర్ నుండి స్ఫూర్తిదాయకమైన అంశాలు స్వీకరిస్తూనే, అందుకువిరుద్ధమైన అంశాలు వదిలించు కోవాలి.ఇతరుల నుండి నేర్చుకునే పద్ధతి ఇది.గద్దర్ 1968 – 72 దశకంలో ప్రజ్వరిల్లినశ్రీకాకుళం,నక్సల్ బరి విప్లవ ప్రజా ఉద్యమాల నేపథ్యంలో, దేశ వ్యాపితంగా ఏర్పడినవిప్లవ వెల్లువలో భాగంగా విప్లవ రాజకీయాల వైపు ఆకర్షించ బడిననారు.విఠల్ రావుగా ఆయన చేస్తున్న బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వాగ్గేయ కళాకారుడిగా, గద్దర్ గా పెరు మార్చునకొని విప్లవ ప్రజాకళా రంగంలోతన ప్రస్థానం మొదలు పెట్టినారు. కళారూపాల్లో వాస్తవికతతో పాటు మిలిటెన్సీఉండాలి. గద్దర్ ఆట,పాటల్లో మిలిటెన్సీ ఉన్నప్పటికీ అది మరో దిశలో ఉండేది.మార్క్సిజం – లేనినిజం,మావో ఆలోచన సిద్ధాంతం పేరుతో చారు మజుం దార్ ప్రవేశ పెట్టిన అతివాద దుస్సాహసిక పంథా, విప్లవ సాయుధ గెరిల్లా పోరాటమే ఏకైక మార్గం, వ్యక్తిగత హింసావాదం, వర్గ శత్రువు నిర్మూలన కార్యక్రమం, విప్లవ ప్రజా ఉద్యమంలోపై చెయ్యి సాధించి అమలు జరుపు తున్న కాలమది. దేశ వ్యాపితంగా అనేక మంది పెటి భూర్జువా విప్లవ శక్తులుగా ఉన్న ఎందరోయువతి, యువకులు విద్యార్థులు నిజమైనమార్క్సిజం – లేనినిజం, మావో ఆలోచన విధానమంటే ఇదేనని భావించి ఈ అతివాద సిద్ధాంతానికి లోనై ఆకర్షించ బడిననారు. గమనించాల్సిన అంశం ఏమంటే ! వ్యక్తులుగా భూస్వాములను నిర్మూలించడానికి,మార్క్సిజం – లేనినిజం, మావో ఆలోచనసిద్ధాంతం పునాధి అవసరం లేదు. ఇందుకు భిన్నంగా విప్లవ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి, ఉన్నత స్థాయి పోరాట రూపమైనసాయుధ పోరాటం కొనసాగించడానికి ఈసిద్ధాంత మౌలిక అవగాహన అవసరం.ఈ నేపథ్యంలోనే గద్దర్ ఆ సిద్ధాంతానికి అక్షర్షితుడైనాడు.ఆ సిద్ధాంత రాజకీయ దృక్పదంతోఆయన నాయకత్వంలో జననాట్య మండలిఅనే సాహితీ సంస్థ ఏర్పాటైయింది. దీనికి గద్దర్ తెలంగాణా జానపద కళారూపాల్లో తన ఆట,పాటలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నింపి అతివాద దుస్సాహసిక రాజకీయాలకు హితోధోకంగా తోడ్పడినాడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో గద్దర్ పాటలకు ప్రేరణ పొంది అనేక మంది యువతి, యువకులు అతివాద సిద్ధాంతానికీ ఆకర్షితులులైన వారు చాలా మంది ఉన్నారు.మన దేశం అర్ధ ఫ్యూడల్,అర్ధ వలస పునాధిగల వ్యవసాయక దేశం. దేశ విప్లవం ప్రస్తుతంజనతా ప్రజాతంత్ర దశలో ఉన్నది. దీన్ని జయప్రదం చేయుటకు విప్లవ శ్రామిక వర్గ ప్రజలను సంఘటిత పర్చి విప్లవ ప్రజా ఉద్యమాలునిర్మించాలి. సాహితీ సాంస్కృకోద్యమం కూడా ఈ స్థాయిలోనే అభివృద్ధి చెందాలి. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో ఏర్పాటైన ప్రజా నాట్యమండలి సంస్కరణ వాదానికి,రివిజనిస్టు, నయా రివిజనిస్టు రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థగా మిగిలి పోయింది.ఆనాటి విప్లవ వెల్లువలో,విప్లవప్రజా ఉద్యమ అవసరాలను తీర్చ లేకపోయింది.ఈ దోపిడీ రాజకీయ వ్యవస్థలో ప్రజలు ఎదుర్కొనే ఈతి బాదల గురించి మరి,మరి వర్ణించి రాసే గేయాల వలన ప్రజలకు అదనంగాతెలిసేదేమీ లేదు. చైతన్యం కలిగేదేమీ లేదు. మహా అయితే వారు మరొకసారి తమ జీవితాలను చూసుకొని కన్నీరు కారుస్తారు. వీటి వల్ల ప్రజా ఉద్యమానికి కలిగే అదనపు ప్రయోజనం ఏమీలేదు. కావాలిసిందల్లా వారు తమ తమస్యల స్వరూప,స్వభావాలు తెలుసుకోవాలి; సంఘటిత ఉద్యమం ద్వారా వాటిని సాధించ పూనుకోవాలి. అందుకు ప్రజలుప్రత్యక్ష కార్యాచరణదిగి ఈ దోపిడీ వ్యవస్థకువ్యతిరేకంగా పోరాడాలనే సందేశం ఉండాలి.ఈ సందేశం రోజువారి సమస్యలకే పరిమితమై ఉండకూడదు. రాజకీయ, సిద్ధాంతసమస్యలపై ప్రజలకు అర్ధమయ్యే భాషలో పాటలు రాయడం అవసరం. తమ రచనలు,పాటలు కళారూపాల ద్వారా విప్లవ కవులు, కళాకారులు ప్రజల సాంస్కృతి కోద్యమానికి నాయకత్వం వహించాలి.విప్లవోద్యమ నిర్మాణ దశలో ప్రజల చైతన్య స్థాయి ఏ మేరకు ఉంటే సాహిత్యం, కళారూపాలు ఆ మేరకే పరితమై సాగాలి. సాహిత్యం పాటలు,కళారూపాలు విప్లవ ప్రజా ఉద్యమ చైతన్యానికి అనుగుణ్యంగా రూపొందించి ప్రచారం చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సాహిత్యం,విప్లవ కళారూపాలు,ప్రజా ఉద్యమానికి ఒక్క అడుగుకు ముందుకు గాని, మరోఅడుగు వెనుకకు గాని ఉండకూడదు. ప్రజలవెంట,ప్రజలతో నడుస్తూ ప్రజల చైతన్య స్థాయి ప్రతిభింబించే విధంగా సాహిత్య,కళారూపాలు ఉండాలి. విప్లవ ప్రజాతంత్ర ఉద్యమంతో పాటే సాహితీ,సాంస్కృతి కోద్యమంఅభివుద్ది చెందాలి.గద్దర్ నాయకత్వంలోని ఆనాటి జన నాట్యమండలి విప్లవ ప్రజా ఉద్యమ నిర్మాణంతో సంభందం లేని,వ్యక్తి గత హింసా రాజకీయాలను ప్రేరేరింప చేసే ఒక వేధికాగా మార్చినారు. ప్రజల సంఘటిత ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనే చైతన్యానికి మారుగా,నరకండి,చంపండి అనే వ్యక్తిగత హింసారాజకీయాలతో ప్రజల భావోద్యగాలను రెచ్చగొట్టే పాటలు కళా రూపాలను ప్రదర్శించేవారు. ఆ సిద్ధాంత రాజకీయాల పునాధి గానే సాహిత్యం,కళా రూపాలును వెలువరించేవారు.ప్రజా ఉద్యమ చైతన్యానికి అనుగుణ్యమైన కళారూపాలను ఆర్ధికవాద, సరికొత్త  రివిజనిస్టు రాజకీయాలుగా ముద్రలు వేసేవారు. గద్దర్ చే రచించబడి అలపించే పాటలు తెలంగాణ జాన పదాలతో కూడుకొన్న భాణి ఎంతో ఉత్తేజ భరితంగా ఉండేవి.కానీ గద్దర్ఆట, పాట వ్యక్తిగత హింసా విధానాన్ని ప్రేరేపింపచేసే దిశలో సాగి,విప్లవ సాంస్కృతికోద్యమం సరైన దిశలో అభివృద్ధి కాలేకపోయింది.గద్దర్ రచన శైలికి అద్దం పట్టే కొన్ని గేయాలు,ఆగేయాల్లో వ్యక్తిగతహింసా వాదాన్ని పురికొల్పే అంశం ఏవిధంగా చొప్పించ బడింది,కొన్ని గేయాల్లో భూతులతో ముగింపు వ్యాఖ్యానాలు ఎలా

ఉంటాయి ఉదా : కొన్ని గేయాలు ……

ఊరు మనది వాడ మనదిరా కూలినాలి పేదోల్లమ్ కలిసి మెలసి ఉండాలి. సంఘపొల్లాజెండకింద సంఘ మొకటి పెట్టాలి ” మనలదోచే ఈ దొరలను మక్కెలిరుగా దన్నాలే ” ఈ పాట గద్దర్ రాసింది కాదు. అలపించింది.
— మా యాన్న జీతగాడా…..

” నీ కష్టం మెసేటోన్ని బురదల దొక్కరా మా
యాన్న జీతగాడా ”

— అమ్మ నారిగా ……..
” బందూకు లందుకొని పరుగెత్తుకు రమ్మంది ”

— గొల్ల కుర్మ గోత్రం….
” కొడవలి కత్తులు బరిసెలు గొడ్డలందు కుంటు
నృ,గొల్లకుర్మ గోత్ర మింకా గొడ్డలికే శాస్త్రమాయే”

— తుపాకి రాజ్యంలో రన్నా ……
” లంజా కొడుకులదన్న దండులా కదలాలి ”

మొత్తంగా ఈ గేయాల్లోని సారాంశం పూర్తిగావ్యక్తిగత హింసా వాదాన్ని ప్రోత్సహించేవిధంగా సాగుతాయి.ఈ దోపిడీకి మూలమైన ” అర్ధ ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ “కూల దోస్తే తప్పా మన మౌలిక సమస్యలకు పరిస్కారం లభించదనే సంఘటిత వర్గ చైతన్యం ప్రజలకు అభివృద్ధి అయ్యే అంశం ఈగేయాల్లో కనిపించదు.అదే సమయంలో పాటలోని సాహిత్యవిలువలను కూడా గమనించాలి. పాటలో లంజా కొడుకులనే అనే భూతు పదం ఉన్నది ప్రజలు సాంస్కృతిక వెనుకబాటు తనంతోనిత్య జీవితంలో కొన్ని బూతులు మాట్లాడుతూ వుంటారు. కమ్యూనిస్టు విప్లవ కారులుగా ప్రజల సాంస్కృతిక వెనుక బాటు తనాన్ని తొలగించాలి. అది,సాహిత్యం,పాట,మాటల ద్వారా,నిరంతర పోరాటాలలో మమేకమైనప్రజలు జనతా ప్రజాతంత్ర విప్లవ సంస్కృతికిఅలవాటు పడతారు. తమ సాంస్కృతికవెనుక బాటు తనాన్ని వదిలించు కొంటారు.

ఈ దిశగా విప్లవ సాహితీ,సాంస్కృతికోద్యమం ముందుకు సాగాలి. ప్రజల భాష పేరుతోసాంస్కృతిక వెనుకబాటు తన్నాన్ని పెంచొద్దు.గద్దర్ ఆనాటి పీపుల్స్ వార్ నిర్మాణంలో పనిచేసి ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు.ఆ పార్టీతో వచ్చిన సిద్ధాంత నిర్మాణ విభేదాలు ఏమిటో ప్రజలకు తెలియదు. ఆ క్రమంలో గద్దర్ తన ప్రయాణాన్ని వివిధ దశల గుండాసాగించారు.అందులో ప్రముఖంగా చెప్పుకోదగినవి కుల,అస్తిత్వ ఉద్యమాలు, ప్రత్యేక

తెలంగాణ ఉద్యమం, ఆ తరువాత ఆధ్యాత్మిక భావజాలంతో స్వామీజీలు,గుడులుగోపురాలు తిరగడాలు మొదలైనవి ఉన్నాయి.మనదేశంలో అస్తిత్వ ఉద్యమాలకు పునాధి కుల వ్యవస్థ.ఈ కులవ్యస్థ ఒక తేనెతెట్టే లాంటిది.ఈ వ్యవస్థను చక్కగా దోపిడీ వర్గ పాలక, ప్రతిపక్ష పార్టీలు తమ వర్గ పాలనను సుస్థిరం చేసుకొనేందుకు నిర్మాణయుతంగాకొనసాగిస్తున్నారు. ఈ కులాలను తమ ఎన్నికల రాజకీయ అవస రాలకోసం ఉపయోగించుకుంటన్న పరిస్థితిని చూస్తున్నాం.

వేల సం:రాల ఈ కులవ్యవస్థ మన దేశంలో పునాధిఅంశం, ఉపరితల అంశం ఎంతమాత్రం కాదు.

ఇది మనువాద బ్రహ్మణీయ భావాజాలమా ?ఫ్యూడల్భా వాజాలమా ? ఏదయినా కావచ్చును. అంతిమంగా ప్రజల సాంఘీక జీవనానికి, దోపిడీ,దౌర్జన్యాలకు పునాధిగా వుంటూవారి మధ్య ఐక్యతకు, సామాజిక విప్లవానికి
అవరోధంగా మారింది. వ్యవస్థాగత పునాధి అంశమైన ఈకుల వ్యవస్థ సాంఘీక, సంస్కరణవాద ఉద్యమాల నశించబడదు. ప్రజలు దోపిడీకి వ్యతిరేకంగా సంఘటిత ఉద్యమ నిర్మాణ క్రమంలో ప్రజలు కులం మర్చి సంఘం పెట్టి పోరాడిన, పోరాడు తున్న ఆనుభవాలు
చాలా ఉన్నాయి.ఆ సమయంలో ప్రజలు కుల
విభేదాలను అంతగా పట్టించుకోరు.సామాజిక విప్లవం ద్వారా అర్ధ ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకిలించి,అధికారం హస్తగతం చేసుకొన్న విప్లవ కార్మికవర్గం అవసరమైతే తమ అధికార బలాన్ని ఉపయోగించి బల వంతంగా తొలగిస్తుంది. ప్రస్తుతం కుల
నిర్మూలన కోసం సాగే అస్థిత్వ, లాల్ – నీల్ ఐక్యతా ఉద్యమాలు, కులం పేరుతో వెలసి కొనసాగుతున్న దళిత, బహుజన పార్టీలు కుల నిర్మూలన కోసం మాత్రం కాదు. దళితబహువజన కులాల్లోని సంపన్న భూర్జువా
శక్తులుగా అభివృద్ధి అయిన వారు,తమ పార్లమెంటరీ రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకోవడం కోసం క్రింది కులాల ఐక్యత నినాదం తీసుకొస్తున్నారు. ఈ నినాదంతో అధికార
పీఠమెక్కి దారి దోపిడీకి పాలుపడిన విషయం ప్రజల అనుభవంలో ఉన్నది.( బహుజన పార్టీ బహిన్ జీ మాయావతి )గద్దర్ వర్గ దృష్టిని వదులు కొని శ్రామిక వర్గ

ప్రజల్లో కుల చీలికలును పెంపొందించే తప్పుడు అస్తిత్వ, కుల ఉద్యమాల్లో తన ఆట,పాటల ద్వారా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఉదాహారణకు దళిత ఉపకులాలైన మాదిగ రిజర్వేషన్ ఉద్యమం పాల్గొని మాలలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఉపన్యాసం ఖమ్మం సభలో చేసినారు. ఈ దేశ రాజ్యాంగంలో విద్య – ఉపాధి మౌలిక, ప్రాధమిక హక్కులు
గా చేర్చబడినాయి. దోపిడివర్గ అనుకూల పాలన విధాన వలన ఉపాధి అవకాశాలు లేక కోట్లాది మంది నిరుద్యోగులు నిరుద్యోగులుగా మిగిలి ఆత్మహత్యలకు పాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. రాజ్యాంగా బద్డంగా అమలు జరగాల్సిన మౌలిక డిమాండ్ల సాధ
న కోసం కాకుండా, దళితుల్లో చీలికలు సృష్టించే ఉపకుల చీలికలు, తప్పుడు ఉద్యమాలకు గద్దర్ మద్దతుగా నిలిచినారు.తెలుగు మాట్లాడే వారంతా ఆంధ్రులు భాష ,

సంస్కృతి, సంప్రదాయాలు మొత్తం కలిపి ఒకే జాతికి చెందిన వారు,తెలుగు జాతి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పాలక పార్టీలలో అధికారం నుండి మినహాయించ బడిన
రాజకీయ నిరుద్యోగులు లెవాదీసిన ఉద్యమం. వారంతా భూర్జువా అర్ధ ఫ్యూడల్ భూస్వామ్య సంపన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వారు. వారు అధికారానికి దూరమై
ప్రతి సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చేవారు. అసమాన అభివృద్ధి పేరుతో ఒకే జాతికి చెందిన ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి తమ అధికార దాహంతీర్చుకొనే లక్ష్యంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టే వారు. దీనికి తెలంగాణలోని
భూర్జువా వర్గపు,రియల్ ఎస్టర్స్, కాంట్రాక్టర్ల సంపూర్ణ సహకారంతో నడిచిన ఉద్యమం.తమ అధికార దాహం తీర్చు కొనేం ఇందులో అసంతృప్తితో ఉన్న మధ్యతరగతి నిరుద్యోగ యువతి,యువకులు, కార్మిక వర్గం పాల్గొన్న మాటకూడా వాస్తవం.అంత మాత్రాన ఇది ప్రజల ప్రజాస్వామి ఆకాంక్షలు నెరవేర్చే ఉద్య
మం ఎంత మాత్రం కాదు.కాగా ప్రత్యేక తెలంగాణాలో ప్రజాస్వామ్య తెలంగాణా పేరుతో అంతర్జాతీయ కార్మికవర్గ వాదులైన యం.యల్ గ్రూపుల వారు,వారు, వీరు అనకుండా అందరూ ముందు వరుసలో ధూమ్ – దాంలు నిర్వహించి పాల్గొన్నారు.అర్ధ ఫ్యూడల్ భూస్వామ్య,భూర్జువా పాలకవ ర్గాలైనప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ” ప్రజాస్వామ్య తెలంగాణ ” ఏ విధంగా సాధ్యమో ,ఆ నినాదం ఇచ్చిన వారికే తెలియాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ నిరసనను వ్యక్తం చేసే హక్కు, సభలు,సమావేశాలు నిర్వహించు కొనే రాజ్యాంగ బద్ద హక్కులు హరించి వేయబడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అక్షరాల పోలీసు రాజ్యం అమలు చేస్తున్నారు. ఈ అంశం విప్లవ ప్రజాస్వామిక శక్తులకు ఈ పాటికే అనుభవం లోనికి వచ్చింది.ఒకే జాతి ప్రజల మధ్య అసమాన అభివృద్ధి పేరుతో, ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే తప్పుడు ఉద్యమాల్లో పజాయుద్ధ నౌక గద్దర్,పాలవర్గ యుద్ధ నౌకగా మారి ధూమ్, దాంలతోప్రధమ శ్రేణి దళనాయకుడుగా పాల్గొన్నాడు.గద్దర్ శాస్త్రీయ భౌతిక వాద సిద్ధాంతమైన మార్క్సిజాన్ని జీర్ణించుకున్నట్లుగా అనిపించదు. ఏమోషనల్ గా స్వీకరించిట్లు, చివరిదశలో ఆధ్యాత్మిక భావజాలం,స్వామీజీలనుకలవడం,గుడులు,గోపురాలు తిరగడం వంటి,ఆయన ఆచరణ ద్వారా గమనించ వచ్చును.చివరకు ఆయన ఏ దోపిడీ పాలక వర్గాలకు

వ్యతిరేకంగా తన గళమెత్తి పోరాడినారో, ఆపాలక వర్గ పార్టీల ప్రపాపకం కోసం ప్రాకులాడుతూ తిరిగినాడు. ఆయన శరీరంలో తుపాకి గుండ్లు దించిన దోపిడీ పాలక వర్గాలే అధికార లాంచనాలతో దహహన సంస్కారాలు నిర్వహించే విచిత్ర పరిస్థి నెలకొన్నది. శ్రామిక వర్గ
ప్రజల్లో ఆయన అమరుడురుడుగా మిగిలి
పోకుండా చేసింది.విప్లవోద్యంలో అనేక మంది
విప్లవ రచయితలు కళాకారులు అమరులైన వున్నారు. వారిలో అమరజీవి సుబ్బారావు పాణిగ్రహి శ్రీకాకుళ విప్లవప్రజా ఉద్యమంలో ఆవిర్భ వించిన విప్లవ కార్యకర్త, విప్లవ కవి. విప్లవోద్యమంలో అరుడైన ఆయన అమర
త్వంతో విప్లవ కారులు స్ఫూర్తిని పొంద గల
రు. గద్దర్ నుండి పొందే స్ఫూర్తి ఏమిటో,
పొంద కూడనిది ఏమిటో విప్లవశక్తులు నిర్ణయించుకోవాలి.

ఈ విధంగా గద్దర్ మొదటగా విప్లవ ప్రజాతత్రఉద్యమ నిర్మాణంతో సంబంధంలేని వ్యక్తిగత హింసా వాదాన్ని,ఆ తరువాత తన వర్గ దృష్టిని కోల్పోయి అస్తిత్వ,ప్రాంతీయ ఉద్యమాలకుమద్దతు ఇవ్వడం,పాలక వర్గాల ప్రాపకం,అభి
వృద్ధి నోరోధక తిరోగన ఆధ్యాత్మిక భావజాలం స్వీకరించడం వంటివి గద్దర్ జీవితంలో చోటుచేసుకున్న అంశాలు. ఒక స్థిర జీవితం,చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని ప్రజల కోసం విప్లవోద్యమంలోకి రావడం మనం స్ఫూర్తి పొందే అంశం. దాన్ని స్వీకరిస్తూ ఆయన మరణానికినివాళులు అర్పిద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *