పొలం కేసులో పోలీసుల జోక్యం ..ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు
సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలో రెచ్చిపోయిన పోలీసులు
పొలం కేసులో జోక్యం చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతు
నాగర్ కర్నూల్, ఆర్ పి న్యూస్:
నాగర్ కర్నూల్ – వంగూరు మండలం ఉల్పర గ్రామానికి చెందిన క్యామ వెంకటేశ్వర్లును పొలం గొడవల్లో అరెస్ట్ చేసిన పోలీసులు.
కోర్టులో ఉన్న పొలం కాకుండా తన సొంత పొలాన్ని చదును చేస్తుండగా వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తీసుకెళ్లి, కొట్టిన వంగూరు ఎస్ఐ.. వెంకటేశ్వర్లు కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన అన్న, అల్లుడు, కుమారుడిపై బైండోవర్ కేసు పెట్టిన పోలీసులు.
ఆ తర్వాత కోర్టులో ఉన్న భూమిని దున్నిన ప్రత్యర్ధి మనిషి ఏ. సుజీవన్ రెడ్డి. దీనిపై వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా పట్టించుకోని ఎస్ఐ.. ప్రత్యర్థులకు కొమ్ముకాస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని సీఐకి ఫిర్యాదు చేసిన వెంకటేశ్వర్లు.
పోలీసుల తీరుతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు వెంకటేశ్వర్లు.