విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం:పిడిఎస్ఎఫ్
విద్యా ప్రైవేటీకరణకు, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం:పిడిఎస్ఎఫ్
రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సమస్యలు పరిష్కరించడం లో ప్రభుత్వం విఫలమైందని విద్యారంగం లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని పిడిఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. నేడు పిడిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం (ఎల్బీనగర్) దగ్గర కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మరికంటి హరీష్ మాట్లాడుతూ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకొని పదేళ్లు గడిచిన నీళ్లు, నిధులు,ఉద్యోగాల కావాలన్న ఆకాంక్ష నెరవేరలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగాన్ని రక్షిస్తామని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి, వ్యాపారాన్ని అడ్డుకుంటామని చెప్పిన మాట ఏమైందన్నారు. ప్రభుత్వ అండతోటి అడ్డగోలుగా లక్షల రూపాయల ఫీజులు పెంచడమే గాక, మాఫియాగా తయారైన ప్రైవేట్,కార్పొరేట్ విద్యా సంస్థలు ట్యూషన్, కాలేజ్ , నీట్ ,జేఈఈ కోచింగ్ ఫీజుల పేరుతో విద్యార్థులను నిలువున దోస్తున్నరు.ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దోపిడీని అడ్డుకోవాలని, విద్యకు సరిపడ నిధులు కేటాయించి కామన్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చి విద్యారంగాన్ని కాపాడాలని కోరారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలలో జరిగిన కుంభకోణానికి మోడీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, నీట్ పరీక్షలు మళ్ళీ నిర్వహించి 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, వెంకటేష్, శివ, వేణు, మధు, అంజి ,గణేష్ లు పాల్గోన్నారు.