బీసీ కులాల ప్రయోజనాలకై కృషి: పద్మా రావు గౌడ్

0

బీసీ కులాల ప్రయోజనాలకై కృషి

గంగపుత్ర సంఘం భవనం ప్రారంభించిన

ఎమ్మెల్యే పద్మా రావు   గౌడ్

సికింద్రాబాద్, ఆర్ పీ న్యూస్ : బౌద్దనగర్ లో గంగపుత్ర స్థానిక సంఘం నూతన భవన ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిదిగా పాల్గొన్నారు. సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని బీ.సీ.కులాలు సంఘటితంగా వ్యవహరిస్తూ తమ హక్కులను కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. తాము తొలి నుంచే బీ.సీ.కులాల సంక్షేమానికి అత్యధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని వెనుకబడిన కులాల వారికీ అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ వారిని తమ వంతు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పరంగా, వ్యక్తిగతంగా తాము బీ.సీ.ల హక్కులను పొందేందుకు సహకరిస్తామని పద్మారావు గౌడ్ స్పష్టం చేశారు. కార్పొరేటర్ కంది శైలజ మాట్లాడుతూ గంగాపుత్ర సంఘం నూతన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంలో తన వ్యక్తిగత విరాళాన్ని కూడా పద్మారావు గౌడ్ అందించారని ప్రశంసించారు. గంగ పుత్ర సంఘం నేతలు దేశాబోయిన రఘు, కైరం కొండ సత్యనారాయణ, ప్రభాకర్, పాక మూర్తి, బాలయ్య, హరి, సీనియర్ నేతలు కంది నారాయణ, పుల్లయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గంగాపుత్ర సంఘం నేతలు పద్మారావు గౌడ్ ను ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *