NTAని తక్షణమే రద్దు చేయాలి:వామపక్ష విద్యార్ధి,యువజన సంఘాల డిమాండ్
NTAని తక్షణమే రద్దు చేయాలి
వరుస పరీక్షల అవకతవకల పై ఎన్.టి.ఎ.అధికారులపై విచారణ జరపాలి
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
-వామపక్ష విద్యార్ధి, యువజన సంఘాల డిమాండ్
ఆసిఫాబాబాద్, ఆర్ పీ న్యూస్:
జాతీయ పరీక్షలను నిర్వహించడంలో NTA మరియు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క అత్యంత బాధ్యతారాహిత్యాన్ని విద్యార్ధి యువజన సంఘాలు (SFI,PDSU,DYFI) కుమురం భీం జిల్లా కమిటీలు తీవ్రంగా ఖండించాయి.వామపక్ష విద్యార్ధి , యువజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు.ఈ సంధర్బంగా SFI జిల్లా కార్యదర్శి చాపిలే సాయి కృష్ణ, PDSU జిల్లా కార్యదర్శి జగజంపుల తిరుపతి, DYFI జిల్లా అధ్యక్షులు గెడం టికానంద్ లు మట్లాడుతూ NTA ప్రారంభం నుండి మొత్తం విద్యా వ్యవస్థను అపహాస్యం చేస్తుందన్నారు.
దేశంలో పరీక్షల నిర్వహణలో NTA పూర్తిగా అసమర్థంగా ఉంది, NEETలో పేపర్ లీక్, CUET పరీక్షలో పోరపాట్లు మరియు ఇప్పుడు తాజాగా UGC NET 2024 పరీక్ష సమగ్రంగా నిర్వహించడంలో వైఫల్యం NTA భాద్యత రహిత్యానికి, దాని రాజీ ధోరణికి నిదర్శనమన్నారు…
NEET ప్రశ్నాపత్రం 30 నుండి 32 లక్షలకు అమ్ముడు పోయిందన్నారు.NET ప్రశ్నాపత్రం కూడా 5 నుండి 6 లక్షలకు అమ్ముడు పోయిందని అన్నారు.విద్యార్థుల పరీక్షలకు ముందు “పరీక్షా పే ” చర్చ పెట్టే ప్రధాని నరేంద్ర మోడీ 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు నష్టం జరుగుతుంటే ప్రధాని కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీల ప్రవేశ పరీక్ష (CUET) లో పొరపాట్లు, మరియు NEET పరీక్ష లీక్ దాని చుట్టూ కొనసాగుతున్న వివాదాల తర్వాత ఈ నెల 18 వ తేదీన జరిగిన UGC NET పరీక్ష రద్దు జరిగిందన్నారు.నిరంతరం విద్యారంగంలో విభేదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కనీసం నివారించే చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిందన్నారు.వీటన్నింటికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి తప్పుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.విద్యారంగాన్ని,పరీక్షలను కేంద్రీకృతం చేసి ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లను,సంస్థలను పెంచి,విద్యలో మతోన్మాదాన్ని పెంచే దృష్టితో NEPలో భాగంగా NTA సృష్టించడం వెనుక ఉన్న కుట్రను తిప్పోకోట్టాలని, విద్యార్ధులకు వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వసాకె సాయికుమార్, పిడిఎస్యు జిల్లా నాయకులు హరిశ్చంద్ర ప్రసాద్ , రమ్యకుమారి, జీవన్, రాహుల్ , డివైఎఫ్ఐ జిల్లా నాయకులు పురుషోత్తం, శ్రావణి,PDSU నాయకులు సాయి రాజ్, సుధాకర్ , రోహిత్ ,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.