అక్రమ భవన అనుమతిని రద్దు చేయాలని మున్సిపాలిటీ ముందు నిరసన ధర్నా
పెండ్యాల యాదగిరి అక్రమ భవన అనుమతిని రద్దు చేయాలని మున్సిపాలిటీ ముందు నిరసన ధర్నా
– దళిత ప్రజాసంఘాల జేఏసీ డిమాండ్
నర్సంపేట, ఆర్ పి న్యూస్ :
నర్సంపేట శుక్రవారం దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళితరత్న కల్లేపల్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు దళితప్రయాసంగాలజేఏసీ కో కన్వీనర్ దళితరత్నతడుగుల విజయ్ మహాజన సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ దళిత రత్న అందే రవి డిపిఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మాట్లాడుతూ
ఇటీవల నర్సంపేట పట్టణంలో 121 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమిగా 2011లో గుర్తించి అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్ వాకేటికర్ణ ఆదేశాల మేరకు 121 హద్దులను నిర్ధారించిహద్దురాయినిసర్వే అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. 2011లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. తరువాత రెవెన్యూ పోలీసు సిబ్బందికలసిగుడిసెలపై దాడులు చేసి గుడిసెలను కాళీ చేయించడం జరిగింది.దళిత మాదిగ గుడిశ వాసులపై 25 పోలీసులు కేసులు పెట్టడం జరిగింది.మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 121 లో కోటి రూపాయల అంబేడ్కర్ భవన నిర్మాణానికి టెండర్ లక్ష రూపాయలు వేయడం జరిగింది. 121 లో సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. దానికి భిన్నంగా ఇటీవల 121 ప్రభుత్వ భూమిని 129 భూమిగా మున్సిపాలిటీ కమిషన్ నుండి భవన నిర్మాణానికి అనుమతులు పొందడం జరిగింది అట్టి అనుమతులను రద్దు చేయాలని మున్సిపాలిటీ అధికారులకు డిమాండ్ చేస్తున్నాం.
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నాగరాజు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దొంతి మాధవ రెడ్డి గారికి దళిత ప్రయాసంగాలు చేసి ప్రతినిధి బృందం త్వరలో కలిసి 121 భూమిపై నివేదికను అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమ ప్రతినిధులు. మంద ప్రకాష్ బోయిన్ నారాయణ శ్రీకాంత్ దామరసుధాకర్ ఇమ్బడిలల్లి చింతం సిద్ధూ అరుణ్ రవి కుమార్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.