తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం చేసిన కేంద్రం: గుంటి వీర ప్రకాష్.

0

తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో తీరని అన్యాయం చేసిన కేంద్రం: గుంటి వీర ప్రకాష్.
నర్సంపేట, ఆర్ పీ న్యూస్:

పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గుంటి వీర ప్రకాష్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా గుంటి వీర ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఊసే లేదు అని అన్నారు గత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుంపటిగా మార్చి అన్ని వ్యవస్థలను రవాణా, రెవెన్యూ, విద్య, వైద్యం నిర్వీర్యం చేసిందని ఆదుకోవలసిన సమయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని అన్నారు.

రాష్ట్రంలో నెలకొల్పవలసిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, టెక్స్టైల్ పార్క్, వరంగల్ లో విమానాశ్రయ నిర్మాణం వంటి అంశాల ఊసు ఎత్తకుండా తెలంగాణ ప్రజలను ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు.రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి చేసి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం మే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కోరారు.పార్లమెంటు ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకొని బిజెపి ఎంపీల గెలుపుకు కారణమైందని గెలిచిన 8 మంది బిజెపి ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *