రిటైర్డ్ తర్వాత ప్రజాసేవకు అంకితం కావాలి వేముల సాంబయ్య గౌడ్

0

రిటైర్డ్ తర్వాత ప్రజాసేవకు అంకితం కావాలి వేముల సాంబయ్య గౌడ్

సమాజంలో అన్నింటికన్నా నిస్వార్ధమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి

నర్సంపేట, ఆర్ పి న్యూస్ :

రిటైర్మెంట్ తర్వాత ప్రజాసేవకు అంకితం కావాలని నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో లీడర్ వేముల సాంబయ్య గౌడ్ అన్నారు.
నర్సంపేట పట్టణంలోని జెడ్ పి హెచ్ ఎస్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు ఉదయగిరి ఉమాదేవి గారి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శాంతి కుమారి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ రిటైర్డ్ ఎంఈఓ గండి లింగయ్య గౌడ్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ బాబు లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో అన్నింటికన్నా నిస్వార్ధమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని సేవ అని,భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. అనంతరం ఉమాదేవి దంపతులను శాలువాతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో. డిసిఇబి సెక్రెటరీ పట్టాభి , రమాదేవి, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సదాశివుడు, గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం కాంతారావు,  పి ఆర్ టి యు అసోసియేటివ్ అధ్యక్షులు ఉమామహేశ్వర్, సూచన శ్రీనివాస్ రావు, చెన్నారావుపేట ప్రధానోపాధ్యాయురాలు పాపమ్మ , చెన్నారావుపేట పిఆర్టియు మండల ప్రెసిడెంట్ పూజారి సురేందర్, ప్రధాన కార్యదర్శి భానుమతి, వెంకన్న, పీఏ సీపీఎస్సీయు అధ్యక్షుడు పాత శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి శీలం మల్లయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *