నల్ల పోచమ్మ దేవాలయం అన్యాక్రాంతం
నల్ల పోచమ్మ దేవాలయం అన్యాక్రాంతం
ఆలయ భూమి కాపాడాలంటూ గ్రామస్తుల నిరసన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గుండన్న పల్లి గ్రామస్తులు తమ గ్రామ నల్ల పోచమ్మ ఆలయ భూమిని కాపాడాలని బుధవారం ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన తిరుపతమ్మ తన భూమిలోని కొంత భాగాన్ని నల్ల పోచమ్మ ఆలయానికి విరాళంగా ఇచ్చిందన్నారు. దశాబ్దాలుగా తిరుపతమ్మ వంశస్థుల నిర్ణయం మేరకు నల్ల పోచమ్మ గ్రామ దేవతను అదే భూమిలోని ఉడుగు చెట్టు కింద ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు. ఇటీవల కొందరు దళారులు తిరుపతమ్మ భూమిని విక్రయింపజేశారని, నల్ల పోచమ్మ ఆలయ భూమి కూడా తిరుపతమ్మ విక్రయించిందంటూ దళారులు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారన్నారు అని.ఆవేదన వ్యక్తం చేశారు