మైలారం గుట్ట మైనింగ్ పనులు నిలిపివేయాలి
మైలారం గుట్ట మైనింగ్ పనులు నిలిపివేయాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
హైదరాబాద్/ బాగ్ లింగంపల్లి, తెలంగాణ సేన న్యూస్:
మైలారం గుట్ట పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో గుట్ట పై జరుగుతున్న మైనింగ్ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కు సైంటిస్ట్ బాబురావు, ప్రొఫెసర్ హరగోపాల్, పి ఓ డబ్ల్యూ సంధ్య, సీ ఎల్ సీ అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ, వేణుగోపాల్ లతో పాటు పలువురు పాల్గొని ప్రశాంగించారు. మైలారం గుట్టకు చారిత్రక ప్రాధాన్యత ఉందని, పేద ప్రజల జీవన ఆధారమైన మైలారం గుట్టలను విధ్వంసం చేయడం సరికాదు అని పేర్కొన్నారు. గుట్ట పై ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని,గుట్ట పై జరుగుతున్న మైనింగ్ పనులు నిలిపివేయాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కడమంచి రాంబాబు, చంద్రమౌళి, శ్రీహరి, జాన్, జక్కుల వెంకటయ్య, పరుశురాజ్, శ్రీదేవి, మైలారం గ్రామస్తులు పాల్గొన్నారు.