భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి:సీతక్క

0

– భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– ఇప్పటికే ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది

– అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

– గత సంవత్సరం లో జరిగిన పొరపాట్లు ఇప్పుడు మనం
చెయ్యద్దు

– భారీ వర్షాల దృశ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

జిల్లాలో గత మూడు రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి వర్యులు సీతక్క గారు జిల్లా అధికార యంత్రాంగానికి సూచించారు

ములుగు, ఆర్ పీ న్యూస్ :

ఆదివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్, ఎస్పీ అడిషనల్ కలెక్టర్ మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు,ఎం పి డి ఓ, ఎంపి ఓ లతో భారీవర్షాల దృశ్య సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్మా మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా తరలించాలని మంత్రి సీతక్క గారు అధికారులకు సూచించారు.

వరదల నేపథ్యంలో పునరావాస కేంద్రం అన్ని ఏర్పాటు చేసి, ప్రజలను తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు సూచించారు.

గోదావరికి ఎగువనున్న నుండి వచ్చే వరదకు వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహించనున్న నేపథ్యంలో తహశీల్దార్ లు, ఎంపిడివో లు తమ మండల పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ, ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే ఉధృతంగా ప్రవహించే వాగుల వద్ద సంకేత బోర్డ్ లు పెట్టాలన్నారు.
అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా బారికేడ్లు, ప్లాస్టిక్ కోన్స్, త్రెడ్ మరే
ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా చూడాలన్నారు.

వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ఆవకాశం ఉంటుదని కాబట్టి రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా రెవెన్యూ అధికారులు విధ్యుత్, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

జిల్లాలోని చెరువులు, కుంటలు, ప్రోజెక్ట్ లలోని నీటి మట్టాలను ఎప్పటి కప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి సీతక్క గారు అధికారులను ఆదేశించారు.

అలాగే గ్రామాల్లో పంచాయితీ సెక్రటరీ లు సైతం తమ పరిధిలోని చెరువుల నీటి మట్టాలను గమనిస్తూ. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

ప్రజల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.

డీపీఓ పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించి అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్‌ఎంలు,
ఆశాలు, ఐకేపీ సీసీలు క్షేత్రస్థాయిలో గ్రామాలను సందర్శించి జ్వరాలు, డెంగ్యూ, ఇతర కేసులను గుర్తించి తక్షణమే జాగ్రత్తలు తీసుకుని వైద్య సేవలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఫారసు చేయాలన్నారు.

నీటిపారుదల శాఖ సిబ్బంది ఏ ఈలు వారి వారి పరిధిలోని చెరువులను తనిఖీ చేయాలి సందర్శించిన ఫోటోలను సమర్పించాలని,
ఏదైనా అత్యవసర మరమ్మతులు అవసరమైతే వెంటనే చేపట్టి పూర్తి చేయాలి ఈ ఈ ల ద్వారా నివేదికలను సమర్పించాలన్నారు.

గోదావరి వరద నీటి మట్టం పెరుగుతోందని, ఈ వరద వల్ల ప్రభావితమయ్యే గ్రామాలు, రహదారుల గురించి, సమాచారం ప్రజలకు చేరవేయాలి. ఆ ప్రాంతంలో రవాణా నియంత్రణ చర్యలు చేపట్టాలి. ముంపు ప్రాంతాల ప్రజలు ఎగువ సురక్షిత ప్రదేశానికి తరలించాలి.

జిల్లా వైద్యాధికారి, సిబ్బంది,
ఇతర ప్రోగ్రామ్ వైద్యులు గ్రామాలను సందర్శించి గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య కార్యకలాపాలను పరిశీలించి, గర్భిణీలను గుర్తించి వైద్య సేవలకు ఆసుపత్రులకు తరలించాలి. జ్వరాలు మరియు డెంగ్యూ కేసులను గుర్తించి వైద్య సేవలు అందించాలి.వర్షాలు మరియు పారిశుధ్యం, ఆరోగ్య సమస్యల పరంగా రానున్న 3 రోజులు మరింత క్లిష్టమైనవి. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, ముంపు సమస్యలపైశ్రద్ధ వహించాలి. ఏదైనా అత్యవసర పరిస్థితులను నా దృష్టికి గాని జిల్లా కలెక్టర్ దృష్టికి తేవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ అడిషనల్ కలెక్టర్ గారితో పాటు మండల స్పెషల్ అధికారులు తో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *