ప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి :పద్మారావు గౌడ్
ప్రజల ఇబ్బందుల నివారణలో అధికారులు సహకరించాలి : పద్మారావు గౌడ్ ఆదేశం
సికింద్రాబాద్, ఆర్ పీ న్యూస్ : అడ్డగుట్ట లోని గంగాపుత్ర సంఘం సమీపంలో నిర్మాణ సామగ్రి, చెత్త చెదారం వల్ల పాముల బెడదను తాము ఎదుర్కొంటున్న అంశాన్ని స్థానికులు సోమవారం సికింద్రాబాద్ శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ను కలిసి వివరించారు. తాము పట్టుకున్న పామును వారు ఈ సందర్భంగా చూపుతూ తమ ఇబ్బందులను ఎకరువుపెట్టారు. వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్ జీ.హెచ్.ఎం.సి. అధికారులను సంప్రదించి 24 గంటల్లో వారి ఇబ్బందిని పరిష్కరించాలని, పాములు సంచరించ కుండా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ప్రజల ఇబ్బందులను వెంటనే పరిష్కరించని పక్షంలో తాము తీవ్రంగా పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పార్కుల అభివృద్దికి ఏర్పాట్లు
పార్కులు, క్రీడా మైదానాల అభివృద్దికి ఏర్పాట్లు జరుపుతున్నామని సికింద్రాబాద్ ఎం.ఎల్.ఏ. తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా పార్కు లో షటిల్ ఆడే క్రీడాకారులు సోమవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమను పార్కులో ఆడుకొనేందుకు మున్సిపల్ అధికారులు అనుమతించడం లేదని ఫిర్యాదు చేశారు. పార్కు లో వారికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు జరుపుతామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఫ్రైడే మార్కెట్ సమీపంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదించామని, త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.