పంట రుణాల చెక్కులను పంపిణీ చేసిన కే ఆర్ నాగరాజు

0

పంట రుణాల చెక్కులను టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు తో కలిసి పంపిణీ చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కే ఆర్ నాగరాజు 

వర్ధన్నపేట, ఆర్ పీ న్యూస్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫి లో భాగంగా పాక్స్ వర్ధన్నపేట,రాయపర్తి మరియు కొలన్ పల్లి సొసైటీ పరిదిలోని రుణ మాఫీ అయిన పలు గ్రామాల 44 మంది రైతులకు 34 లక్షల 20 వేల రూపాయల కొత్త పంట రుణాల చెక్కులను తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెని రవీందర్ రావు గారితో కలసి పంపిణీ చేసిన గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న అర్ధికస్థితిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ కార్యకలాపాలకు స్థిరంగా ఉండే విదoగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల కోసం ఋణ మాఫీ అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు.రుణ మాఫీ ద్వారా రైతులకు చేరినటువంటి డబ్బులను త్వరగతిన రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రుణ మాఫీ కాని రైతుల ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు,కొన్ని చిన్న సమస్యల వల్ల ఆలస్యం జరుగుతుంది అంతేకానీ వేరే కారణాలు ఏమి వుండవు.రుణ మాఫీ కానీ రైతులు నేరుగా వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్తే సమస్యను వెంటనే పరిష్కరించి రుణ మాఫీ అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడతారు..ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంక్ సిబ్బంది రైతులకు సహకరించాలని అన్నారు..ఈ రుణ మాఫీ ప్రక్రియ పూర్తి స్థాయిలో రైతులకు చేరేలా అధికారులు ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంగోతు అరుణ, వర్ధన్నపేట ప్యాక్స్ చైర్మన్ రాజేష్ ఖన్నా, రాయపర్తి ప్యాక్స్ చైర్మన్ రామచంద్ర రెడ్డి, కోలన్ పల్లి ప్యాక్స్ చైర్మన్ వెంకట్ రెడ్డి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు, బ్యాంక్ మేనేజర్ సమత, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మండల మరియు పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు రైతులు, బ్యాంక్ సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *