కాంగ్రెస్ లో గ్రూపులను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదు:మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ లో గ్రూపులకు స్వస్తి పలకాలి
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం
నర్సారెడ్డి చెప్పిన వారికి పదవులు
కాంగ్రెస్ లో గ్రూపులను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదు
గజ్వేల్, ఆర్ పీ న్యూస్:
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు సుమారు 100 మంది నాయకులు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ మేడమ్ గారిని అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కలవడం జరిగింది అంతకుముందు సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారిని కలిసి గజ్వేల్ నియోజకవర్గంలో హైదరాబాదులో ఉండే పీసీసీ నాయకుడు అని చెప్పుకునే ఓ నాయకుడు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీల గ్రూప్లో ప్రోత్సహిస్తున్నాడని ఇతను ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలలో ఏనాడు పార్టీకి పనిచేయలేదని ఇతను అనుచరులు బిజెపి పార్టీకి పనిచేసిన ఆధారాలతో సహా చూపెట్టడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మంత్రివర్యులు కొండ సురేఖ మేడం గారు గజ్వేల్ నియోజకవర్గం లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నరసన్న ఆధ్వర్యంలో మెరుగైన ఫలితాలను ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇప్పుడే బలోపేతం అవుతుంది ఇలాంటి సమయంలో పార్టీకి నష్టం చేసే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నష్టం జరుగుతది కనుక నియోజకవర్గ ఇన్చార్జి లకు వ్యతిరేకంగా గ్రూప్లను ప్రోత్సహిస్తే సహించేది లేదని జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సారెడ్డి పార్టీకి సుప్రీం అని ఇన్చార్జి సూచించిన వారికే పార్టీ పదవులే గానీ నామినేటెడ్ పదవుల లిస్ట్ ను ఆమోదిస్తామని తెలిపారు. త్వరలో గజ్వేల్ మార్కెట్ కమిటీ పాలకమండలికి నియామకానికి సంబంధించిన జీవో ఇస్తామని తెలిపారు.