తెలంగాణలో మళ్లీ అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం.
తెలంగాణలో మళ్లీ అడ్డదారిలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ ప్రయత్నం జరుగుతుందని నిరుద్యోగ జేఏసీ నాయకులు మహిపాల్ యాదవ్ తెలిపారు. వికారాబాద్ బ్యాక్ లాక్ అక్రమాలపై సంచలన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
రెండు నెలల కింద ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లిన అప్పుడేమో నామమా ఆపివేసి అందరూ మర్చిపోయారు. అనుకొని మళ్ళీ తొందరలో నిరుద్యోగులకి అన్యాయం చేయడానికి బ్యాక్ లాగ్ ఉద్యోగాలను అక్రమంగా అడ్డదారిలో భర్తీకి సన్నహాలుజరుగుతున్నట్లు సమాచారం ఉందని మహిపాల్ యాదవ్ అన్నారు.
ఈ బర్తిని ఆపకపోతే నేను నిరుద్యోగుల తరపున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా. వికారాబాద్ లో కూడా దొడ్డిదారిన బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది.ఇప్పటికైనా విరమించుకోకపోతే మీ వివరాలు కూడా సేకరించి అక్రమంగా బ్యాక్లాగ్ పోస్టుల్లో ఎక్కుతున్న అభ్యర్థుల పై. ఈ దారుణానికి కారకులైన ప్రభుత్వ అధికారుల మధ్యవర్తుల అభ్యర్థుల డాటా సేకరిస్తున్నాం తొందర్లోనే సి CS గారికి లేదా CM గారికి ఈ డాటా ను సమర్పించి వీరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం అని ఈ సందర్బంగా మహిపాల్ యాదవ్ పేర్కొన్నారు.
చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, వికారాబాద్ తో పాటు వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం,నిజాంబాద్ హైదరాబాద్, నారాయణపేట్,మిగతా జిల్లాల్లో కూడా ఈ ప్రయత్నం పై పోరాటానికి నేను
గుర్తుచప్పుడు కాకుండా జిల్లాలలో మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ తదితర శాఖల్లో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ జరుగుతున్నాయి,
దీనివల్ల నిరుద్యోగ యువకులకు తీరని నష్టం చేకూరుతుంది. గతంలో కూడా నిర్మల్ మున్సిపల్ లో ఏకంగా 44 పోస్టులు భర్తీ చేయడం జరిగింది.
దీనికి ఎంక్వైరీ కమిటీ అధికారికగా ఆర్డీవో గారిని నియమించారు. 44 ఉద్యోగాలలో జరిగిన అవకతవకల గురించి ఇంకా పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వలేదు 44 ఉద్యోగాలను అంగట్లో వేలం వేసి అమ్ముకున్నారు.
వీటిలో కొన్నిటిని అమ్ముకోగా బంధువులకి బందు మిత్రులకు కట్టబెట్టారు. ఒక్కో పోస్ట్ కి 16 లక్షల వారికి వసూలు చేసినట్లు సమాచారం.