పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్
మహబూబాబాద్, ఆర్ పి న్యూస్:
మహబూబాబాద్ లో నిర్వహించినటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లకు సంబదించి జరిగిన అర్ధ వార్షిక నేర సమీక్షలో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి స్టాఫ్ కి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కొత్తగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తునటువంటి రైటర్ భరత్ కి ఉత్తమ రైటర్ గా, ప్రశాంత్ కి 5ఎస్ ఇంప్లిమెంటేషన్ విభాగంలో ఎస్పీ చేతులమీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. మరియు పోలీస్ఉ స్టేషన్ తరుపున ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిద్దరికీ కొత్తగూడ ఎస్ఐ కుశ కుమార్ పోలోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.