లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా
న్యూ ఢిల్లీ, ఆర్ పీ న్యూస్:
ఎన్డీఏ కూటమి నుంచి స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక అయ్యారు.విపక్ష కూటమి అభ్యర్థి సురేష్‌పై ఓంబిర్లా గెలుపొందారు.మూజువాణి ఓటుతో ఓంబిర్లా గెలిచినట్టు ప్రకటన చేశారు.ఓంబిర్లాకు ప్రధాని మోదీ, రాహుల్ అభినందనలుతెలిపారు. మోడీ, రాహుల్
స్పీకర్ ను కుర్చీలో కూర్చోబెట్టారు.రాజస్థాన్ రాష్ట్రం కోటా నుంచి ఎంపీగా ఎన్నికైన ఓంబిర్లా కోటా నుంచి వరుసగా మూడుసార్లు ఓంబిర్లా ఎంపీ గా గెలుపొందారు.స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలుతెలిపారు. రెండోసారి స్పీకర్గా ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్‌సభను విజయవంతంగా నడపడంలో మీ పాత్ర అమోఘం అని మోడీ కొనియాడారు.మరో ఐదేళ్లు సభను విజయవంతంగా నడుపుతారని ఆశిస్తున్నాను. ఓం బిర్లా ఆధ్వర్యంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. మీ సలహాలు, సూచనలు అవసరం. డిజిటలైజేషన్‌తో లోక్‌సభ పేపర్‌లెస్‌గా మారింది అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.48 ఏళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది.1952, 1967, 1976లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది.ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలం, ఇండియా కూటమికి 232 సభ్యుల బలం,రెండు కూటముల్లో లేని మరికొన్ని పార్టీలు ఉన్నాయి.ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు తెలిపింది.