రాజీ మార్గమే రాజమార్గం: ఎస్ఐ బొజ్జ మహేష్
రాజీ మార్గమే రాజమార్గం
– లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలి
ఎస్ఐ బొజ్జ మహేష్
ఎల్లారెడ్డి, ఆర్ పీ న్యూస్ :
రాజీ మార్గమే రాజమార్గం అని, లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ ఐ బొజ్జ మహేష్ అన్నారు.ఈ నెల 8 వ తారీఖున ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ లో నిర్వహించే జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి మండలం లోని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని, సమస్యను పరిష్కరించుకోవాలని ఎస్ఐ మహేష్ అన్నారు. కక్షిదారులు రాజీకి ఆమోదయోగ్యమైన క్రిమినల్, సివిల్, వివాహ,కుటుంబాల తగాదాలు, రోడ్డు ప్రమాదాలు, చిట్ ఫండ్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ కేసులు ఇతర కేసులపై లోక్అదాలత్ వేదిక ద్వారా పరిష్కరించుకోవాలని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ విముక్తి చెందాలంటే రాజీ మార్గం ఎన్నుకోవాల్సిదేనని వారు తెలిపారు. కక్షిదారులు రాజీని కుదుర్చుకొని మండలంలో నేర రాహీత మండలంగా తీర్చిదిద్దాలని మండల ప్రజలకు ఎస్ఐ మహేష్ విజ్ఞప్తి చేశారు.