తరలిరండి లక్ష డప్పులు -వేల గొంతుల ప్రదర్శనకు తరలి రండి
తరలిరండి లక్ష డప్పులు – వేల గొంతుల ప్రదర్శనకు
:బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక
హైదరాబాద్, ఆర్ పి న్యూస్:
ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు వేల గొంతులు మహా ప్రదర్శనకు బీసీ కవులు కళాకారులు రచయితలు మేధావులు వేలాదిగా తరలి రావాలని ప్రముఖ కవి గాయకులు దరువు అంజన్న పిలుపునిచ్చారు, మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ జెండా ఊపి లక్ష డప్పులు వేల గొంతులు మహా ప్రదర్శన
రాష్ట్రయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా దరువుఅంజన్న మాట్లాడుతూ 30 ఏళ్ల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ అమలు దగ్గరలోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారికంగా దీనిని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు, ఎస్సీ వర్గీకరణ అనేది ప్రజాస్వామిక మైనటువంటి హక్కుని మందకృష్ణ మాదిగ తన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చాలా గొప్పదని ఆయన కొనియాడారు, ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ మోహన్ బైరాగి మాట్లాడుతూ సుప్రీంకోర్టు సైతం వర్గీకరణ అమలు చేయాలని కోరిందని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని వెంటనే అధికారికంగా అమలు చేయాలని కోరారు, రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యాత్రను జిల్లాలలో మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు, సిపిఐ మేడ్చల్ జిల్లా ఉప కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా మాదిగల చేస్తున్నటువంటి ఈ యుద్ధం ప్రజాస్వామికమైనటువంటిదని వారి కోరికను తప్పక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో క్రాంతి కళా బృందం రాష్ట్ర అధ్యక్షులు వెంకటాచారి, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు వడ్డెర నరసింహ, తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రవీణ్ యాదవ్, మహాజన వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ డప్పు రామస్వామి, ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రణయ్, కార్యదర్శి శివ,
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి
కొయ్యడ వెంకటేష్ మాదిగ
జవహార్ నగర్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు , ఏనూతుల నగేష్ మాదిగ ,ఆనంద్ మాదిగ ,విక్రమ్క త్త నరేష్ మాదిగ , నాగునూరి యాదయ్య, మల్లేష్ , సాయి కుమార్ , కొమరయ్య , కె .రమేష్ , ప్రభాకర్ , తిరుపతి , , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.