ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ కులగణన చేసి, బీసీ లకు రిజర్వేషన్ పెంచాలి

0

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ కులగణన చేసి, బీసీ లకు రిజర్వేషన్ పెంచాలి

కొత్తగూడ, ఆర్ పీ న్యూస్:

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షులు హోదాలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ కులగణన చేసి, బీసీ ల రిజర్వేషన్ పెంచాలని బీజేపీ కొత్తగూడ మండల మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడ తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. బీజేపీ బీసీ మోర్చా మండల అధ్యక్షులు మామిడి.యాకయ్య అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంగాపురం. బిక్షపతి, బీసీ మోర్చా మండల అధ్యక్షులు మామిడి. యాకయ్య మాట్లాడుతు కామారెడ్డి లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ ప్రకారం బీసీ డిక్లరేషన్ అమలు చెయ్యాలని, బీసీ లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి పుచికత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.బీసీ కులగణన చేసిన తరువాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి.మురళి,బీజేపీ ములుగు అసెంబ్లీ కో కన్వీనర్ బోడ నవీన్ నాయక్,బీజేపీ మండల కోశాధికారి తుపాకుల.పరుశురాం,బీజేపీ మండల ఉపాధ్యక్షుడు వజ్జ రవి,బీజేవైఎం మండల అధ్యక్షులు కొట్టె. శ్రీను, బీజేపీ కొత్తగూడ బూత్ అధ్యక్షులు పిన్నింటి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *