కరకగూడెం ఎన్కౌంటర్ తెలంగాణ నాయకత్వాన్ని నిర్మూలించే కుట్రలో భాగంగా చూడాలి
కరకగూడెం ఎన్కౌంటర్ తెలంగాణ నాయకత్వాన్ని నిర్మూలించే కుట్రలో భాగంగా చూడాలి
– అశ్వాపురం మణుగూరులో నిర్బంధించిన పౌరహక్కుల సంఘం నాయకులను తక్షణమే విడుదల చేయాలి
తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, కో కన్వీనర్ మెంతెన సంజీవరావు
మణుగూరు, ఆర్ పి న్యూస్ :
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం రఘునాధపాలెం వద్ద చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఆరుగురు తెలంగాణ సతీస్ ఘడ్ ప్రాంతాలకు సంబంధించిన మావోయిస్టులు చనిపోయిన విషయమై ఈరోజు సంఘటన ప్రదేశానికి నిజనిర్థారణకు వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వాన్ని మణుగూరు పోలీసులు నిర్బంధించడాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగభూషణం, కో కన్వీనర్ మంతెన సంజీవరావు ఖండించారు, నిజనిర్ధారణ ఆపడం అంటే వాస్తవాలు బయటికి రాకుండాచేయడమేనని, నిజమైన ఎన్కౌంటర్ అయితే నిజనిర్ధారణ బృందాన్ని ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి అనుమతించాలని డిమాండ్ చేశారు, రఘునాధపాలెం బూటకపు ఎన్కౌంటర్ కేంద్ర పారామిలటరీ బలగాల, ఇంటెలిజెన్స్ పోలీసులు పక్కా పథకంతో కాల్చి చంపడం వల్లనే నేడు నిజనిర్ధారణ బృందాన్ని పత్రికల వారిని అనుమతించకుండా అడ్డుకొని అశ్వారాపురం పోలీస్ స్టేషన్లో నిర్భందించారని వారు స్పష్టం చేశారు మావోస్టుపార్టీ వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని బలపరచడంతో పాటు, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం పోరాడాలని పిలుపునిచ్చిన దాంట్లో ముందు నిలిచిందనడంలో సందేహం లేదు,
78 సంవత్సరాలు దాటిన స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం పౌర హక్కులను అమలు చేయలేక పోయింది అనడానికి తెలంగాణలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ మరొఒక ఉదాహరణగా వారు పేర్కొన్నారు, గతంలో చెరుకూరు రాజ్ కుమార్ ఎన్కౌంటర్ సందర్భంగా సుప్రీంకోర్టు రిపబ్లిక్ తన పిల్లల్ని తాను చంపుకోదని వ్యాఖ్యానించింది, మరి తెలంగాణ నాయకత్వాల మరణాల ఎన్కౌంటర్లకు కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులను బాధ్యులను చేయగలదా అని ప్రశ్నించారు? ఈ ప్రస్థానం చూస్తుంటే తెలంగాణకు భారత రాజ్యాంగం వర్తిస్తుందా లేదా అనుమానం కలుగుతుంది అన్నారు .దళితుల ఆదివాసి గిరిజనుల మహిళా సమస్యలకు పవిత్ర పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంట్ అసెంబ్లీ చర్చల ద్వారా పరిష్కారం చూపడానికి బదులు బల ప్రయోగమే పరిష్కార మార్గంగా ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు,చట్టాలను తెచ్చిన ప్రభుత్వాలే వాటిని వుల్లంగించి,చట్టాలకు తమ వ్యవస్థకే మాతృకైనా భారత రాజ్యాంగాన్నీ ఉల్లంగించి, ఆదివాసీ ప్రాంతాల్లో కనిజవనరులను బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టి దానిని వ్యతిరేకించిన వారు దేశద్రోహులు అవుతారా?అని నిలదీశారు.హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు తదితరులను పోలీసులు విడుదల చేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి నిర్ధారణ కోసం వెళ్లడానికి అనుమతించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ డిమాండ్ చేస్తున్నది, ప్రజలు ప్రజాస్వామికవాదులుఖండించాలని వారు పేర్కొన్నారు, ఈ ప్రకటనలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు మచ్చ విద్యాసాగర్, రామటెంకి అశోక్, ఎట్టి ప్రశాంత్,కుంజ రాగవులు తదితరులు ఉన్నారు.
పౌర హక్కుల సంఘం నాయకులను బేషరతుగా విడుదల చేయాలి
– సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 5న పోలీసుల కాల్పుల్లో 6గురు మరణించిన ఘటనపై నిజనిర్ధారణ చేయడానికి వెళుతున్న పౌర హక్కుల సంఘం (CLC) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు తో పాటు 12 మందిని మణుగూరు పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ముమ్మాటికి ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే. ముందు నుండి ఈ ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది నిజమైన ఎన్కౌంటర్ అయితే పోలీసులు ఎందుకు నిజనిర్ధారణ చేయడానికి ఆటంకాలు కల్పిస్తున్నారో స్పష్టం చేయాలి. గత ప్రభుత్వాల లాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్రాజస్వామికంగా, నిరంకుషత్వంగా వ్యవహరిస్తున్నట్లు ఈ ఘటన రుజువు చేస్తున్నది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను మానుకోవాలి. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలి. నిజనిర్ధారణకు ఎటువంటి ఆటంకాలు కల్పించరాదు. ఎన్కౌంటర్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపియాలని డిమాండ్ చేస్తున్నాము.
పి సూర్యం
సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ
రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ
పౌర హక్కుల సంఘం నాయకుల అరెస్ట్ కు Cpiml మాస్ లైన్ ఖండన
కరకాగూడెం మండలం రఘునాధ పాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్ పై విచారణకు వెళుతున్న పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కె రవి, కుమారస్వామి, శిరీష తదితరులను 12 మంది బృందాన్ని మణుగూరు లో అరెస్ట్ చేయడాన్ని Cpiml మాస్ లైన్ (ప్రజా పంథా) తీవ్రంగా ఖండిస్తుంది.ప్రజాస్వామిక హక్కులు గారంటీ అన్న ప్రభుత్వం , కనీసం విచారణకు కూడా హక్కుల సంఘం నాయకులను వెళ్లనివ్వక పోవడం అన్యాయం..
పోటు రంగారావు
Cpiml మాస్ లైన్
మణుగూరులో అరెస్టు చేసిన CLC రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి,లక్ష్మణ్ ,నారాయణ రావు తదితరులను వెంటనే విడుదల చేయాలి!
కరకగూడెం బూటకపు ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం(CLC ) రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్,రాష్ట్ర కార్యదర్శి నారా యణ రావు,సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితర 11 మంది హక్కుల సంఘo నాయకుల్ని మణుగూరు సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది..నిజనిర్ధారణకు వెళ్లుతున్న వారిని ఆపడం అంటే వాస్తవాలు బయటకు రాకుండా తొక్కిపెట్టడమే అవుతుంది.నిజమైన ఎన్కౌంటర్ అయితే నిజ నిర్ధారణ బృందాన్ని జరిగిన ప్రాంతానికి అనుమతించాలి.
కరకగూడెం ఎన్కౌంటర్ పోలీసులు పక్కా పథకం ప్రకారం కాల్చి చంపడం వల్లనే నిజనిర్ధారణ బృందాన్ని, పత్రికల వారిని అనుమతించ కుండా, బయట ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా చేయుటకు నిజ నిర్ధారణ బంధాన్ని అశ్వాపురం పోలీ సు స్టేషన్లో నిర్బంధించారని భావించాల్సి వస్తోంది..నిజనిర్ధారణ బృందాన్ని విడుదల చేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి, వాస్తవాలను తెలుసుకొనుటకు అనుమతించాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నది.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజాస్వామిక పాలన అనే ఏడవ గ్యారంటీ ని ఖచ్చితంగా అమలు చేయాలని మా పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నది.
సాదినేని వెంకటేశ్వర్ రావు
ప్రధాన కార్యదర్శి
సీపీఐ (ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ
14-9-2024
CLC రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అక్రమ రక్షణ ఖండించండి:IFTU రాష్ట్ర కమిటీ
మణుగూరు ఏరియా ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకార్పుల విషయంపై నిజానిజాలను నీగ్గు తేల్చడానికి నిజనిర్ధారణ కమిటీ గా వెళ్తున్న CLC రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నారాయణ లతోపాటు 11 మంది ప్రతినిధులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య(IFTU) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. అరెస్టు చేసిన CLC నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు చేసిన అరెస్టుతో కరకగూడెం ఎన్కౌంటర్ బూటకమని స్పష్టమైందని, కమిటీ పేర్కొన్నది ఒకవేళ అది నిజం కాకపోతే నిజనిర్ధారణ కమిటీ అనుమతించవలసి ఉంటుంది. ఇప్పటికైనా అరెస్టు చేసిన వారిని తక్షణ విడుదల చేసి నిజానిజాలు తెలుసుకోవడానికి clc సభ్యులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అన్నదించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎం శ్రీనివాస్
IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కమిటీ