జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ హత్య పిరికి పందల చర్య:డి జె యు
జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ హత్య పిరికి పందల చర్య—-దోషులను కఠినంగా శిక్షించాలి
—డీజేయూ డిమాండ్
హైదరాబాద్: చత్తీస్గఢ్ జర్నలిస్టు ముకేశ్ చంద్రకర్ హత్య పిరికి పందల చర్య అని,దోషులను కఠినంగా శిక్షించాలి అని డి జే యు జాతీయ కమిటీ డిమాండ్ చేశారు. వాస్తవాలను వెలికి తీసే జర్నలిస్టులను హత్యాలతో,భౌతిక దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలను కోవడం అవినీతిపరుల అవివేకమే అవుతుంది తప్ప, హత్యలు, భౌతిక దాడులకు జర్నలిస్టులు భయపడరనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుతెరగాలని ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన అవినీతి కాంట్రాక్టర్లు తీరును, వారికి కాపలా కాస్తున్న ప్రభుత్వ యంత్రాంగంను తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ దోషులకు కఠినంగా శిక్షించాల్సిందిగా జాతీయ కమిటీ డిమాండ్ చేసింది.జర్నలిస్టు
ముకేశ్ చంద్రకర్ హత్యను డెమోక్రటిక్ జర్నలిస్ట్స్ యూనియన్ (డీ జేయూ) తీవ్రంగా ఖండించింది. ఈ దారుణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హత్య వ్యవహారంలో విచారణను వేగవంతం చేసేందుకు కాలపరిమితి విధించాలని, హంతకులను చట్ట ప్రకారం శిక్షించాలని డిజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పెరుగుతున్న దాడుల మీద ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న జరల్నిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ముకేశ్ చంద్రకర్ కుటుంబానికి డిజేయూ నాయకులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా, ముకేశ్ చంద్రకర్ (31) ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. అవినీతి, గిరిజన సమస్యలపై వార్తలు రాశారు. యూట్యూబ్ ఛానల్ ‘బస్తర్ జంక్షన్’ను నడుపుతూ బహుళ ప్రాచుర్యం పొందారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఆచూకీ లేని చంద్రకర్ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. ముకేశ్ చంద్రకర్ హత్యను డి జే యు తీవ్రంగా ఖండిస్తూ, అవినీతి వెలికి తీసే జర్నలిస్టులను చంపడం పిరికిపందల చర్యఅని ,ఇలాంటి చర్యలకు నిజాయితీ గల జర్నలిస్టులు ఎవరు భయపడరని ఈ హత్యను ను తీవ్రంగా ఖండిస్తూ దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.