వివాదాస్పదంగా మారిన రాష్ట్ర గీతం కూర్పు
By K Rajendra Prasad
వివాదాస్పదంగా మారిన రాష్ట్ర గీతం కూర్పు
– కీరవాణి సంగీతం పై తెలంగాణకళాకారుల అభ్యంతరం
– ఉద్యమకాలంలో ఆ పాటను రికార్డు చేయించింది టీఆర్ఎస్ పార్టీ నే
– అందేశ్రీ మాటలు తెలంగాణ ఆత్మగౌరవంను దెబ్బ తీషాయి
– తెలంగాణ రాష్ట్రం త్యాగాల ఫలం
– రాష్ట్ర అస్థిత్వ చిహ్నంను తొలగించడం తెలంగాణకే అవమానం
– జయజయ హే తెలంగాణ గీతం ను రేవంత్ ఏనాడైనా పాడారా
ఓ టీవీ చర్చా ఘోష్టి లో దేశపతి శ్రీనివాస్
హైదరాబాద్, ఆర్ పీ న్యూస్ :
తెలంగాణ కవి అందేశ్రీ రాసిన జయజయ హే తెలంగాణ రాష్ట్ర గీతం కూర్పు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. జూన్ రెండు న సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని రాష్ట్ర గీతం గా అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ గేయం కు సంగీతం కూర్పు బాధ్యత కీరవాణికి అప్పగించడం వివాదాస్పదం అయ్యింది. ఇతర రాష్ట్రానికి చెందిన కీరవాణికి సంగీతం బాధ్యతలు ఇవ్వడం పట్ల తెలంగాణ కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేయగా బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేశాశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ జయ జయ హే పాట రాసిన అందేశ్రీ కే గీతం రూపకల్పన బాధ్యతలు ఇచ్చామని వెల్లడించారు. ఈ నేపథ్యం లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చఘోష్టి లో తెలంగాణ గాయకులు దేశపతి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జయజయ హే తెలంగాణ పాట ను రాష్ట్ర గీతం గా స్వాగతిస్తున్నామని అయితే అందేశ్రీ తెలంగాణ లో సంగీత కళాకారులు లేరని అవమానపరచడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో జయజయహే తెలంగాణ పాటను రికార్డు చేసింది టీఆర్ ఎస్ పార్టీ నే అని గుర్తు చేశారు. పదేళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేదని యాంకర్ ప్రశ్న పై దేశపతి స్పందించారు..జాతీయ గీతం ఉన్నందున ఆ పాట గురించి కెసిఆర్ ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని మాతో ఎప్పుడూ ఈ విషయం చర్చించలేదని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రం కు చెందిన కీరవాణికి సంగీత బాధ్యతలు అప్పగించడం పట్ల తెలంగాణ కళాకారులు, సంగీత దర్శకులు ఆత్మగౌరవ సమస్యగా భావిస్తున్నారని అన్నారు. జై బోలో తెలంగాణ పాట తెలంగాణ ఆత్మగౌరవం తోపాటు, ఆస్థిత్వాన్ని ప్రతిబింభించేలా అందేశ్రీ ఈ పాటను రాసాడని, ఈ పాట స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించ్చిందని, తెలంగాణ అట్టుడికిందని తెలిపారు. అలాంటి అందేశ్రీ నేడు తెలంగాణ లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ లు లేరు అని అవమానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానని దేశపతి శ్రీనివాస్ తన అభిప్రాయంను వ్యక్తం చేశారు.
ఎవరి దయా దాక్షిణ్యాలతో స్వరాష్ట్రం ఏర్పడలేదని ప్రజల పోరాట ఫలం ప్రత్యేక తెలంగాణ అని స్పష్టం చేశారు.
అంతే కాకుండా రాష్ట్ర అస్థిత్వ చిహ్నం కాకతీయ కళా తోరణం ను తొలగించడం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం అని చెప్పారు.రాష్టంలో ప్రజా పాలన లేదని, ప్రజా దర్భార్ నిర్వహిస్తామనే మాటతో గెలిచారాని, ఇప్పుడు ప్రజా దర్భార్ కొనసాగడం లేదని, ఇచ్చిన హామీలు ఏవి అని ఆయన ప్రశ్నించారు.