కవిత పై సోషల్ మీడియా లో వేధింపులు
కవిత పై సోషల్ మీడియాలో వేధింపులు
మహిళా కమిషన్ ను ఆశ్రయించిన బి ఆర్ ఎస్ మహిళా నేతలు
హైదరాబాద్, ఆర్ పి న్యూస్ :
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకురాలు, హ్యూమన్ రైట్స్ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ స్మిత కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బుద్ధాభవన్ లో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కు వినతి పత్రం ను అందజేశారు. X వేదికగా ఫోటో మార్ఫింగ్ చేసిన @అరవింద్ అన్న ఆర్మీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటో మార్ఫింగ్ చేసి X వేదికగా @అరవింద్ అన్న ఆర్మీ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయ, శైలజ, కవిత, అనూష తదితరులు పాల్గొన్నారు.