అక్రమ అరెస్టులు మానుకోవాలి:మునీశ్వర్తె
అక్రమ అరెస్టులు మానుకోవాలి
సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యానికి బలైన హమాలీ కార్మికులు
సివిల్ సప్లై హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్తె
వరంగల్ / మహబూబాబాద్ /ములుగు :
తెలంగాణ స్టేట్ అమలు యూనియన్ ఆధ్వర్యంలో హమాలి కార్మికుల రేట్లు గత సంవత్సరం 31-07-2023 అగ్రిమెంటు అయిపోయింది. ఇప్పటివరకు ఏడు నెలలు కావస్తున్నా రాష్ట్ర కమిటీ ద్వారా జూన్ 10 2024 రోజున సివిల్ సప్లై భవనం ముందు ధర్నా చేసి మెమొరాండం సమర్పించిన తదుపరి రెండు రోజులలో ప్రకటిస్తామని అధికారులు చెప్పగా 30 జూలై 2024 వరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో 31 జులై 2024 రోజున ధర్నా చేయుట నిర్ణయించడం అందరికి సమాచారం అందించడం జరిగింది. ఈ ధర్నాకు పోనివ్వకుండా పోలీసులు కార్మికులను అడ్డగించి అరెస్టు చేయడం జరిగింది. ఇట్టి అక్రమ అరెస్టులను రాష్ట్ర కమిటీ పూర్తిగా వ్యతిరేకరిస్తూ గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా అక్రమ అరెస్టులను అవలంబించింది ఇప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వము అక్రమ అరెస్టులను వ్యతిరేకరిస్తూ తక్షణమే అధికారుల నుండి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.