హాస్టల్లో ఇన్వేటర్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినిలు
స్థానికంగా ఉండని వార్డెన్లు
హాస్టల్లో ఇన్వేటర్ లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థినిలు
నాగార్జున సాగర్, ఆర్ పీ న్యూస్ :
హాలియా మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS ) ఆధ్వర్యంలో హాలియాలో గురువారం సంక్షేమ హాస్టల్ అధ్యయన యాత్రలో భాగంగా ఎస్సీ గర్ల్స్, బీసీ గర్ల్స్ హాస్టల్స్ లో సమగ్ర సర్వే నిర్వహించారు,
ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను మాట్లాడుతూ వార్డెన్లు స్థానికంగా ఉండటం లేదని వారానికి 2,3 రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని, హాస్టల్లో కరెంటు పోతే ఇన్వెటర్ లేక చదువుకోడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, పాములు, తేళ్లు, హాస్టల్ లోపలికి వస్తున్నాయని అన్నారు, హాస్టల్లో మొత్తం విద్యార్థులు 70 మంది ఉంటే, రెగ్యులర్ గా 30 మంది మాత్రమే ఉంటున్నారని, మెనూ సక్రమంగా అమలు చేయట్లేదని, రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి కొత్త దొడ్డు బియ్యం ఇస్తున్నారని, కొత్త దొడ్డు బియ్యంతో భోజనం, కిచిడి, వండితే ముద్దుల ముద్దలు కావడం, నీళ్ల చారు, నీళ్ల కూరలతో విద్యార్థులు కడుపునిండా తినలేక పస్తులు ఉంటున్నారని, హాస్టల్లో ఉదయం పూట పెట్టాల్సిన టిఫిన్ ప్రతిరోజు రైసు పెడుతున్నారని, ఇడ్లీ వడ పూరి, దోశ వంటి టిఫిన్స్, పెట్టాలని కోరారు , రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు కనుగుణంగా మెస్ చార్జీలు 1500నుండి 2500 వందలకు, ప్యాకెట్ మనీ 1000 రూపాయలు పెంచాలని అన్నారు, హాస్టల్ ప్రారంభించి నెల రోజులు పూర్తవుతున్న నేటికీ నోట్ బుక్స్ బట్టలు దుప్పట్లు ప్లేట్లు గ్లాసులు ఇవ్వలేదని, విద్యార్థులకు పోటీ పరీక్షల మెటీరియల్ ప్రభుత్వం అందించాలని,విద్యార్థినిలకు ప్రభుత్వ డాక్టర్ రెగ్యులర్ గా మెడికల్ చెక్ అప్ చేయాలని జీవో ఉన్న అది అమలు కవడం లేదని, జ్వరం వచ్చిన కడుపునొప్పి లేచిన అనారోగ్యం పాలైన పట్టించుకునే నాధుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రభుత్వం ప్రతి హాస్టల్లో ఆట వస్తువులు, లైబ్రరీ, దినపత్రికలు, అన్ని తరగతుల విద్యార్థులకు ట్యూషన్ ప్రారంభించాలని, ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులను భర్తీ చేయాలని, పై అధికారులు రెగ్యులర్ గా హాస్టల్ లను సందర్శించాలని ఆయన కోరారు
ఈ కార్యక్రమంలో KVPS మండల అధ్యక్షులు కొమ్ము జీవన్ విద్యార్థులు పాల్గొన్నారు.