ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసిన గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు
ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసిన గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు
గజ్వేల్, ఆర్ పీ న్యూస్:
గజ్వేల్ నియోజక వర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ త్వరిత గతిన పూర్తి చేయాలని ఈ రోజు గజ్వేల్ నియోజక వర్గం సీనియర్ నాయకులు గాంధీ భవన్ వెళ్లి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులను కలిసినట్టు సమాచారం.వేం నరేందర్ రెడ్డిని కలిసిన వారిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, సుభాష్ చంద్రబోస్,చారి, గొల్లపల్లి నరేందర్ రెడ్డి, బంగారు రెడ్డి,బుక్క శ్రీనివాస్,మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.కాగా ఇటీవల కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ లో పదవులు ఆశించి భంగపడిన వారు కూడా ఇటీవల వేం నరేందర్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.