మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రాందాస్ గౌడ్
సిద్దిపేట, ఆర్ పీ న్యూస్:
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గత 10 రోజుల క్రితం మరణించాడు. విషయం తెలుసుకున్న వంటిమామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ సోమవారం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు స్థానిక తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్, గ్రామ రైతు సమన్వయ కమిటీ మాజీ అధ్యక్షులు జాలని బాల్ నర్సయ్య,మాజీ వార్డు సభ్యులు చాట్ల పల్లి బాల్ నర్సయ్య,కొండ గాలేష్,నాయకులు ర్యాకం యాదగిరి,లక్ష్మయ్య,యువకులు మల్లేష్,కృష్ణ తదితరులు ఉన్నారు.