కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి :మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి — మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వీది కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య,మున్సిపల్ పాలక వర్గం, వెటర్నరీ AD రమేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని సమాచారం ఉందని,ప్రజలు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పరంగా, మున్సిపల్ అధికారులు కుక్కల పట్ల తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు, కుక్కలకు కుటుంబ నియంత్ర ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ జఖీయుద్దిన్, వెటర్నరీ Ad రమేష్, కౌన్సిలర్స్ వంటేరు గోపాల్ రెడ్డి, రహీమ్ , పంబాల అర్చన శివకుమార్, గంగిశెట్టి చందన రవీందర్, మార్కంటి వరలక్ష్మి కనకయ్య, మామిడి విద్యారాణి శ్రీధర్, బొగ్గుల చందు తదితరులు పాల్గొన్నారు