గజ్వేల్ లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి – ప్రతాప్ రెడ్డి

0

గజ్వేల్ లో నిలిచిపోయిన అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి – ప్రతాప్ రెడ్డి

గజ్వేల్, ఆర్ పీ న్యూస్: 
సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ బస్టాండ్ నిర్మాణ పనులకు గత కేసిఆర్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మంగళవారం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని నూతన బస్టాండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి పరిశీలించిన ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లోని ఉన్నటువంటి పెండింగ్ పనులు ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, పథకాల కింద దాదాపు 200 కోట్ల రూపాయలను గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గజ్వేల్ నియోజకవర్గం లో మంజూరైన నిధులను వెనక్కి తీసుకొని గజ్వేల్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు, గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకు దక్కుతుందని తెలిపారు,
గజ్వేల్ , ప్రజ్ఞాపూర్ బస్టాండ్ అసంపూర్తి నిర్మాణ పనులకు గతంలోని కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన నిధులను వెంటనే విడుదల చేసి బస్టాండ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వలన కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ ఎడారిగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు.గజ్వేల్ పట్టణంలోని అసంపూర్తిగా ఉన్న కోట మైసమ్మ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని,గజ్వేల్ పట్టణంలోని గతంలోనే డబుల్ బెడ్ రూమ్ అర్హుల ఎంపిక కలెక్టర్ ఆర్ డి ఓ సమక్షంలో జరిగిందని, లక్కీ డ్రాను వీడియో కెమెరాలు బంధించి లక్కీ డ్రాను తీయడం జరిగిందన్నారు, లక్కీ డ్రాలో ఎల్లిన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాలని పంపిణీ చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాబోయే నెల రోజులలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *