క్రిస్టియన్ కాలనీలో ఈ నెల 6 న గద్దర్ సంస్మరణ సభ
వరంగల్, ఆర్ పి న్యూస్ :
6 ఆగస్టు 2024 నా వరంగల్లో క్రిస్టియన్ కాలనీ తెలంగాణ జంక్షన్లో జరగబోయే అమరుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ ప్రథమ వర్ధంతిని పునస్కరించుకొని మరియు చుండూరు మృతవీరుల 33వ వర్ధంతి యాది సభ విజయవంతం కోసం విస్తృత ప్రచారం చేపట్టారు. సోమవారం నర్సంపేట లోని అమరవీళ్ల స్థూపం వద్ద కరపత్రం విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. దళిత బహుజన పోరాటం రాష్ట్ర వ్యవస్థాపక కన్వీనర్ కామ్రేడ్ఇమ్మడి బాబు అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక ప్రజా కవుల కళాకారుల స్మారక కమిటీ రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ గడ్డం శరత్ హాజరై ప్రసంగించారు.ఈ సమాజంలో సామాజిక మార్పునకు సాంస్కృతిక విప్లవమే మార్గమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా.. అమరుడు ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న తన జీవితాంత పాట కోసం ప్రజల కోసం దార పోసిన గొప్ప త్యాగశీలి అని మాట్లాడినారు.అలాగే ఐక్య ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ.కన్నం వెంకన్న గారు మాట్లాడుతూ.. కలకల కోసం కాదు ప్రజల కోసమని అంకితభావంతో అమరుడైనటువంటి ప్రజా యుద్ధ నౌక.గద్దర్ అన్నకు ఉర్దూ దినపత్రిక జహీరుద్దీన్ అలీఖాన్లకుసాంస్కృతిక నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం అన్నారు. … అలాగే చుండూరు మృతవీరుల 33 వ వర్ధంతి చరిత్రను సైతం భవిష్యత్ తరాలకు ఈ మహనీయుల జీవిత చరిత్ర ఆదర్శంగా ఆదర్శంగా ఉండాలని కోరుతూ ఈ యాది సభ కార్యక్రమాన్ని వరంగల్లో క్రిస్టియన్ కాలనీ వద్ద 6. ఆగస్టు.2024 మంగళవారం రోజు నిర్వహిస్తున్నాం. కావున ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సామాజిక ప్రజా కవల కళాకారుల స్మారక కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ కామ్రేడ్సుధమల్ల అశోక్ కంజర్ల జాకోబ్ జన్ను సాంబయ్య పోగుల కన్నయ్య గురుమిళ్ళ రాజు రాపర్తి జగన్నాథం రామగిరి కనుకయ్య., అల్లం రాజక్క గండికోట సమ్మక్క రాపోలువెంకన్న తదితరులు పాల్గొన్నారు.