వచ్చే నెల ఆరున నర్సంపేటలో గద్దర్ సంస్మరణ సభ
వచ్చే నెల ఆరున నర్సంపేటలో గద్దర్ సంస్మరణ సభ
నర్సంపేట, ఆర్ పి న్యూస్ :
ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న, ఉర్దూ దినపత్రిక ఎడిటర్ జహీరుద్దిన్ అలీ ఖాన్ ల ప్రధమ వర్ధంతిని పునర్ష్కరించుకొని చుండూరు మృతవీరుల 33 వ వర్ధంతి యాది సభ దివి-6–8-2024 మంగళవారం సాయంత్రం-5-00 గంటలకు, స్థలం తెలంగాణ జంక్షన్ కృష్ణ కాలనీ నర్సంపేట రోడ్డు వరంగల్లులో జరిగే సభను పురస్కరించుకొని నర్సంపేట అమరవీరుల స్తూపం కాడ దళిత బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాటం డిబిఆర్పి వ్యవస్థాపక అధ్యక్షులు ఇమ్మడి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గడ్డం షరత్ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలొ కామ్రేడ్ కన్నం వెంకన్న, గద్దర్ అన్న కాంస్య విగ్రహం వరంగల్లులో నెలకొల్పాలని గద్దర్ అన్న జీవిత చరిత్రను పాఠ్యంశాలల్లో చేర్పాలని, గద్దర్ అన్న విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ పై పెట్టాలని ఈ సందర్భంగా మాట్లాడినాడు. ఈ కార్యక్రమములో కామ్రేడ్ సుద మల్ల అశోక్, కామ్రేడ్ కంజర్ల జేకబ్కా, కామ్రేడ్ జన్ను సాంబయ్య కామ్రేడ్ పోగుల కన్నయ్య కామ్రేడ్ గురుమిళ్ళ రాజురాపర్తి జగన్నాథం రామగిరి కనకయ్య అల్లం రాజక్క గండికోట సమ్మక్క రాపోలు ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.