రెండో విడుత రైతు రుణ మాఫీ:పూడూరులో రైతుల సంబురాలు
రెండో విడుత రైతు రుణ మాఫీ
పూడూరులో రైతుల సంబురాలు
పరిగి, ఆర్ పి న్యూస్ :
పూడూరు మండల కేంద్రం రైతు వేదిక లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత రైతు రుణ మాఫీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి రైతు ఖాతాలో 1,50,000-00 జమ చేయడం వలన రైతులు హర్షం వ్యక్తం చేసి సంబరాలు జరుపుకొవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, అజీంపటేల్, సీనీయర్ నాయకులు తాజోధిన్, లింగప్ప, వెంకటయ్య , అమజత్ , యాదగిరి గౌడ్, మహీళా నాయకురాలు బాలమణి, డైరెక్టర్ శ్రీ శైలం గౌడ్, యువజన సభ్యులు వీరేశం, నరేష్, నవీన్, వీరా రెడ్డి, నర్సింహులు, పాల్గొని ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.