గుడుంబా స్థావరాల పై ఉక్కు పాదం మోపుతం :ఎస్ ఐ కుష కుమార్
గుడుంబా స్థావరాల పై ఉక్కు పాదం మోపుతం : ఎస్ఐ కుష కుమార్
కొత్తగూడ, ఆర్ పి న్యూస్:
గుడుంబా స్థావరాలు ,క్రయ విక్రయాలపై ఉక్కు పాదం మోపుతామని కొత్తగూడ ఎస్. ఐ కుశ కుమార్ తెలిపారు .ఆదివారం రోజున కొత్త గూడ గ్రామం లో ఎస్.ఐ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు .ఈ సమవేశం లో ఎస్ .ఐ మాట్లడుతూ కొత్తగూడ మండలం లో ఏదో ఒకచోట బెల్లం ,గుడుంబా , అక్రమ వ్యాపారాలకు సంబధించి నవి పట్టుబడుతున్నాయని ,పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసిన ఈ దందాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయని ,దీనితో అక్రమ వ్యాపారాలు చేస్తున్నవారి పై ప్రివెంటివ్ డిటెన్షన్(పీడీ )యాక్ట్ కింద సమన్లు జారీ చేస్తామని ,జిల్లా ను గుడుంబా రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని ,నల్ల బెల్లం రవాణాను చాలా వరకు నివారించామని ,అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎవరిని కుడా వదిలిపెట్టబోమని ,ఈ విషయం పై నిఘా పెంచి గుడుంబా వ్యాపారాన్ని మానుకోవాలని హెచ్చరించారు .ఈ స్పెషల్ డ్రైవ్ లో 15 లీటర్ల గుడుంబా స్వాధీనపర్చుకున్నట్లు ఎస్. ఐ కుశ కుమార్ తెలిపారు .